రైతుల సమస్యను పట్టించుకోని ప్రభుత్వం

25 Sep, 2016 23:37 IST|Sakshi
  • ∙అక్టోబర్‌ 2న మౌన దీక్ష
  • ∙రైతు జేఏసీ జిల్లా కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వెంకటనారాయణ
  • హన్మకొండ : రైతులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రైతు జేఏసీ జిల్లా కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఆదివారం  నక్కలగుట్టలోని ఓ హోటల్‌లో రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మౌనదీక్ష పోస్టర్లు జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని రైతులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరికి నిరసనగా  తెలంగాణ జేఏసీ చైర్మ¯ŒS ప్రొఫెసర్‌ కోదండరాం మౌనదీక్ష చేపట్టనున్నారని తెలిపారు.
     
    దీక్షకు రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు డాక్టర్‌ భానుచందర్, డాక్టర్‌ ఎర్ర శ్రీధర్‌రాజు, మోర్తాల చందర్‌రావు, కోల జనార్ధ¯ŒS తదితరులు పాల్గొన్నారు.  

whatsapp channel

మరిన్ని వార్తలు