అంగన్‌వాడీల హేతుబద్ధీకరణ

10 Jul, 2017 23:11 IST|Sakshi
అంగన్‌వాడీల హేతుబద్ధీకరణ

కేంద్రాలను ప్రాథమిక పాఠశాల భవనాలకు తరలింపు
లబ్ధిదారులు లేకపోతే పక్క సెంటర్‌లో విలీనం..
అవసరమైతే మినీ అంగన్‌వాడీలను ప్రధానకేంద్రంగా మార్చడం
ఖాళీ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులను ఆయాలతో భర్తీ చేయడం
కొనసాగుతున్న ప్రక్రియ.. త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం

ఉమ్మడి జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు              3,538
పనిచేస్తున్న             సిబ్బంది          ఖాళీలు
టీచర్లు                    3,268270
ఆయాలు                 2,951             587
మినీ అంగన్‌వాడీలు                         586
ఆయాలు                  3                  245


(ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సెప్టెంబర్‌ నాటి పరిస్థితి ఇది.)
సాక్షి, ఆదిలాబాద్‌: అంగన్‌వాడీల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌) ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ఈ ప్రక్రియ త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఇదే విషయమై హైదరాబాద్‌లో డైరెక్టర్‌తో జిల్లా మహిళా సంక్షేమ అధికారుల సమావేశం జరిగింది. వీలైనంత త్వరలో హేతుబద్ధీకరణ పూర్తిచేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. గత డిసెంబర్‌లో ఐసీడీఎస్‌లో రీఆర్గనైజేషన్‌ చేపట్టడం జరిగింది. కొత్త జిల్లాల వారీగా ప్రాజెక్టుల స్వరూపాలను మార్చుతూ కొత్త డివిజన్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీల హేతుబద్ధీకరణపై దృష్టి సారించడం ఆసక్తి కలిగిస్తుంది.

ఎనిమిది అంశాల ఆధారంగా..
ఎనిమిది అంశాల ఆధారంగా ప్రస్తుతం హేతుబద్ధీకరణ పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది.
1. ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి అంగన్‌వాడీ కేంద్రాలను తరలించడం.
2. అర్బన్, రూరల్‌ హ్యాబిటేషన్లలో ఎస్సీ, ఎస్టీ ప్రాంతా ల్లో ఉన్నటువంటి అంగన్‌వాడీ టీచర్, మినీ అంగన్‌వాడీ టీచర్, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే అవసరం మేరకు భర్తీ చేయాలి.
3. ఐదుగురు గర్భిణులు, బాలింతలు, 20 మంది చిన్నారులు సెంటర్‌లో ఉండాలి. అంతకంటే తక్కువ లబ్ధి దారులు ఉన్న పక్షంలో ఆ కేంద్రాన్ని సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రానికి తరలించాలి. సమీపంలో మినీ అంగన్‌వాడీ ఉంటే దానిని మెయిన్‌ అంగన్‌వాడీగా మార్చేందుకు అవకాశాలు ఉన్నాయా అన్నది పరిశీలించాలి.
4. మెయిన్‌ అంగన్‌వాడీ, హెల్పర్‌ పోస్టు ఖాళీ ఉన్న పక్షంలో అక్కడ సేవలు అందుతున్నాయా.. అందుతున్న పక్షంలో ఎలా అందుతున్నాయి.. సమీపంలో ని అంగన్‌వాడీ సేవలు అందిస్తుందా.. అనేది పరిశీల న చేయాలి. దాన్ని అలాగే కొనసాగించడమా.. విలీనం చేయవచ్చా అనేది పరిశీలన చేయాలి.
5. ఎక్కడైనా అంగన్‌వాడీ టీచర్‌ పోస్టు ఖాళీగా ఉంటే అక్కడ లబ్ధిదారులు ఉన్నారా.. లేదా.. ఉన్న పక్షంలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలి. లేనిపక్షంలో హెల్పర్‌ను సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రానికి తరలించాలి.
6. మినీ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే సేవలు ఎలా కొనసాగుతున్నాయో పరిశీలన చేయాలి. ఆ సెంటర్‌ను సమీపంలోని మెయిన్‌ అంగన్‌వాడీలో విలీనం చేయవచ్చా లేదా అనేది చూడాలి.
7. మినీ అంగన్‌వాడీ హెల్పర్ల భర్తీ ఆవశ్యకతను పరిశీలన చేయాలి.
8. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, డబ్ల్యూసీడీ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం, జాతీయ ఆహార భద్రత మా ర్గదర్శకాలకు అనుగుణంగా అంగన్‌వాడీలు పనిచేస్తున్నాయా లేదా అన్నది పరిశీలించాలి. తుది నిర్ణయం మండల కమిటీ ఆమోదంతో తీసుకోవాలి. మండల కమిటీలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈవో, ఇతర అధికారుల అభిప్రాయాలు సేకరించాలి. జిల్లా కలెక్టర్‌ ఆమోదంతో నివేదిక తయారు చేయాలి.

ఉమ్మడి జిల్లాలో పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలో 3,538 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 3,268 టీచర్లు పనిచేస్తుండగా, 270 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఆయాలు 2,951 మంది పనిచేస్తుండగా, 587 ఖాళీగా ఉన్నాయి. మినీ అంగన్‌వాడీలు 586 ఉండగా.. ఇందులో 341 మంది ఆయాలు పనిచేస్తున్నారు. మరో 245 ఖాళీగా ఉన్నాయి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని సెప్టెంబర్‌ నాటి పరిస్థితి. తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు కావడం, డిసెంబర్‌లో ఐసీడీఎస్‌లో రీఆర్గనైజేషన్‌ చేపట్టి జిల్లాల వారీగా అంగన్‌వాడీ కేంద్రాలను కేటాయించడం జరిగిం ది.ఆదిలాబాద్‌ జిల్లాలో 1256, కుమురంభీం జిల్లాలో 973, నిర్మల్‌ జిల్లాలో 926, మంచిర్యాల జిల్లాలో 969 అంగన్‌వాడీ కేంద్రాలు రావడం జరిగింది.

ఇప్పుడు అంగన్‌వాడీల్లోనూ రేషనలైజేషన్‌ జరుగుతుండగా, ప్ర భుత్వం చెబుతున్న ప్రకారం.. అంగన్‌వాడీ కేంద్రాలను పెంచడం జరగదని, ఉన్నవాటిలోనే పరిస్థితిని బట్టి విలీనం చేయడం వంటివి జరుగుతాయని పేర్కొంటోం ది. కాగా రేషనలైజేషన్‌ తర్వాత ఎన్ని అంగన్‌వాడీ కేంద్రాలు విలీనం కానున్నాయి, ఎన్ని కేంద్రాలు పాఠశాల భవనాల్లోకి మార్చడం జరిగింది, మిగతా వాటిని మార్చకపోవడానికి గల కారణాలు, అంగన్‌వాడీ టీచర్ల పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేసే పరిస్థితి ఉందా.. లేదా, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో పోస్టుల ఖాళీలను భర్తీ చేసే ఆవశ్యకత ఉందా.. మినీ అంగన్‌వాడీ కేంద్రాలు పరిస్థితిని బట్టి ప్రధానంగా మార్చడం, తదితర అంశాలు ఓ కొలిక్కి రానున్నాయి.

ప్రక్రియ కొనసాగుతోంది..
రేషనలైజేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్ని అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేయడం, పాఠశాల భవనాలకు తరలించాలనే వాటి సంఖ్య తేలుతుంది. అంగన్‌వాడీ టీచర్ల పోస్టుల ఖాళీల విషయంలో రేషనలైజేషన్‌ తర్వాతే స్పష్టత వస్తుంది. కలెక్టర్‌ అనుమతితో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం.
– ఉమాదేవి, జిల్లా మహిళా సంక్షేమ అధికారి

మరిన్ని వార్తలు