నిరుద్యోగులతో రైల్వే బోర్డు చెలగాటం

8 May, 2017 23:37 IST|Sakshi

 అనంతపురం ఎడ్యుకేషన్‌ :

 సౌత్‌ సెంట్రల్‌ రైల్వే బోర్డు ఇటీవల ఐటీఐ కోర్సుల అర్హతతో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 17లోగా దర ఖాస్తు చేసుకోవాలని,  దరఖాస్తులు నేరుగా కాకుండా జిల్లా కేంద్రంలోని ఎంప్లాయింట్‌ అధికారి కార్యాలయం, లేదా ప్రభుత్వ ఐటీఐ ద్వారా పంపాలని పేర్కొంది. దీంతో జిల్లాలో ఐటీఐ పూర్తయిన అభ్యర్థులు రోజూ వందలాది మంది ఎంప్లాయిమెంట్, ఐటీఐ కళాశాలకు వస్తున్నారు. అయితే ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో వారు దరఖాస్తులు  తీసుకోకుండా తిరస్కరిస్తున్నారు.  ఐటీఐ, ఎంప్లాయిమెంట్‌ కార్యాలయం అధికారుల వాదన మరోలా ఉంది. తమకు రైల్వే నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని ఈ పరిస్థితుల్లో తాము దరఖాస్తులు తీసుకునేందుకు వీలుకాదని స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థుల నుంచి తాము దరఖాస్తులు స్వీకరించి వాటిని బోర్డుకు పంపితే ఒకవేళ తిరస్కరణకు గురైతే అభ్యర్థులు నష్టపోతారని, అందుకు బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు.   ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు