-

అదే ఆనందం!

8 Jan, 2017 23:16 IST|Sakshi
అదే ఆనందం!

మారని రామనారాయణరెడ్డి తీరు
 
 సాక్షి ప్రతినిధి, నెల్లూరు :  తెలుగుదేశంపార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం రామనారాయణరెడ్డి రగిల్చిన ప్రొటోకాల్ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వ కార్యక్రమాల శిలాఫలకాల మీద జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లా మంత్రి, ఎమ్మెల్సీల పేర్లు లేకపోవడంపై టీడీపీ ముఖ్యనేతల్లో అంతర్మధనం మొదలైంది. ఆనం రామ నారాయణరెడ్డి వ్యవహారాన్ని అధికారపార్టీ ముఖ్యనాయకులు సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసినా మళ్లీ అలాగే వ్యవహరించడంపై ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి శనివారం మరో సారి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించడంపై జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు ఆత్మకూరు నియోజకవర్గ అధికారులపై సీరియస్ అయ్యారు. శుక్ర, శనివారాల్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎంపీపీ డి.కామాక్షమ్మ బహిష్కరించారు.  

 ఆయన మాటే వేదమట
 ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆనం రామనారాయణరెడ్డి పార్టీని, ప్రభుత్వ అధికారులను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో అధికారులందరూ తాను చెప్పినట్లే నడుచుకోవాలని హుకుం జారీ చేశారు. తన మాట కాదంటే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు శంకరగిరి మాన్యాలు చూపిస్తానని నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నియోజకర్గం మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్స వాల కార్యక్రమాలు ఏర్పాటు చేరుుం చారు. ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల శిలాఫలకాల్లో జీఓ 520 మేరకు ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధుల పేర్లు ఉండాలి.

అరుుతే ఆనం రామనారాయణరెడ్డి అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితుడిగా తన పేరు శిలాఫలకంలో అగ్రభాగంలో ఉండే ఏర్పాటుచేరుుంచుకున్నారు. ఇందులో సొంత పార్టీకి చెందిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా మంత్రి పి.నారాయణతో పాటు ఎమ్మెల్సీల పేర్లు కూడా లేకుండా చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలపై ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుకు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. రామనారాయణరెడ్డి చర్యలకు కళ్లెం వేయకపోతే తాము తీవ్రంగా స్పందిస్తామని కలెక్టర్‌కు స్పష్టం చేశారు. దీంతో కలెక్టర్ ముత్యాలరాజు ఆత్మకూరు నియోజకవర్గ అధికారులను మందలించారు.  

 మారని తీరు
 మూడు రోజులుగా ప్రొటోకాల్ ఉల్లం ఘన వివాదాన్ని ఎదుర్కొంటున్న ఆనం రామనారాయణరెడ్డి వ్యవహార తీరుపై శనివారం సాక్షిలో ‘నా మాటే శిలాశాసనం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు ఆందోళన చెందారు. అరుుతే శనివారం సంగం మండలం పెరమన గ్రామంలో నిర్వహించిన పంచాయతీ కార్యాలయ నూతన భవన ప్రారంభోత్సవం, ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం శంకుస్థాపన, సిమెంటురోడ్డు, తాగునీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభోత్సవ శిలాఫలకాల్లోనూ ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగింది. అధికారులు భయ పడి దూరం దూరంగా ఉన్నా ఆనం రామనారాయణరెడ్డి వారి మీద ఒత్తిడి తెచ్చి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు ఏర్పాటు చేరుుంచారు. ఈ శిలాఫలకాల్లో కూడా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లా మంత్రి, ఎమ్మెల్సీల పేర్లు లేకపోవడం అధికారపార్టీలో వివాదా లకు ఆజ్యం పోసింది. రామనారా యణరెడ్డి తీరుపై మంత్రులు, ఇతరులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొని వెళ్లారు.  

 శిలాఫలకంలో టీడీపీ నేతల పేర్లు
 సంగం మండలం పెరమన గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాల్లో టీడీపీ గ్రామ, మండల, జిల్లా కమిటీ నాయకుల పేర్లు వేరుుంచారు. ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య తెలుగుదేశంపార్టీ తరఫున జన్మభూమి పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు నిబంధనల ప్రకారం ఎటువంటి ప్రొటోకాల్ లేదు. అరుుతే ప్రారం భోత్సవాలు, శంకుస్థాపనల శిలాఫలకాల్లో తాటికాయంత అక్షరాలతో ఆయన పేరు ఏర్పాటుచేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సుదీర్ఘకాలం ఐఏఎస్ అధికారిగా పనిచేసిన కృష్ణయ్యకు తెలియకుండా ఈ వ్యవహారం జరిగిందా? లేక తెలిసి కూడా మిన్నకుండిపోయారా అనే చర్చ జరుగుతోంది.

శిలాఫలకాల్లో మంత్రుల పేర్లే లేపేసిన అధికారు లు ఆనం ఆదేశంతో టీడీపీ జిల్లా కార్యదర్శి కర్నాటి రవీంద్రారెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ జి.శ్రీనివాసులుయాదవ్, టీడీ పీ పెరమన గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇనగంటి బసిరెడ్డి, సంగం మాజీ జెడ్పీటీసీ గంగపట్నం శేఖరయ్య పేర్లు చెక్కించారు. అరుు తే వీరందరి పేర్లు ఏ ప్రొటోకాల్ మేరకు శిలాఫలకాల్లో వేరుుంచారని అడిగితే స్థానిక అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. మొత్తమ్మీద ఆత్మకూరులో రగిలిన ప్రొటోకాల్ వివాదం అధికారపార్టీలో, అధికారవర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.  

 ఆత్మకూరు వివాదం ఢిల్లీకి
 ఆత్మకూరు నియోజకవర్గంలో సాగుతున్న ప్రొటోకాల్ ఉల్లంఘన వ్యవహారంపై పార్లమెంటులో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శాసనసభలో ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి హక్కుల ఉల్లం ఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణరుుం చారు. దీంతో ఈ వ్యవహారం త్వరలోనే ఢిల్లీ స్థారుుకి చేరనుంది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పా టు చేసిన అధికారులు పార్లమెంట్‌కు, శాసనసభకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆనం రామనారాయణరెడ్డి రాజకీయంతో తాము ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని అధికారులు కంగారు పడుతున్నారు. ఈ భయంతో శనివారం నిర్వహించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అధికారులు దూరం దూరంగా ఉండిపోయారు.  
 
 కలెక్టర్‌కు మళ్లీ ఫిర్యాదు
 ఆనం రామనారాయణరెడ్డి అధికారుల ను బెదిరించి సాగిస్తున్న ప్రొటోకాల్ ఉల్లంఘన వ్యవహారంపై ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి శనివారం మరో సారి కలెక్టర్ ముత్యాలరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై చట్టప్రకారం చర్యలు తీసుకోకపోతే తాము తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేశారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎమ్మెల్యేకి హామీ ఇచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన అధికారులందరికీ షోకాజు నోటీసులు జారీ చేసి, రాతపూర్వకంగా సంజీయిషీ తీసుకోవాలని ఆయా శాఖాలకు చెందిన జిల్లా అధికారులను ఆదేశించారు

మరిన్ని వార్తలు