కుమారులు ఆదరించడం లేదని..

9 Sep, 2016 00:44 IST|Sakshi
– మనస్తాపంతో వద్ధుడి బలవన్మరణం
– ఆగ్రహించి కుమారులను చితకబాదిన గ్రామస్తులు
రాజాపేట : అవసాన దశలో కుమారులు ఆదరించడం లేదని మనస్తాపతో ఓ వద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లాలో గురువారం వెలుగుచూసిన ఈ విషాదకర ఘటన వివరాలు.. రాజాపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన చెడిదీపు శివుడి(80)కి ఇద్దరు కుమారులు. కులవత్తి చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేశాడు. వారికి వివాహాలు కాగానే జీవనోపాధి నిమిత్తం పెద్ద కుమారుడు నాగభూషణం గజ్వేల్, చిన్న కుమారుడు ఆంజనేయులు హైదరాబాద్‌కు వలసెల్లారు. పెదకుమారుడు బట్టల వ్యాపారం, చిన్న కుమారుడు ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. శివుడు తన భార్యతో గ్రామంలోనే సాంచాలు నేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం భార్య కూడా మతిచెందడంతో ఒంటరయ్యాడు. జీవిత చరమాంకంలో ముద్దపెట్టడం లేదని పెద్ద మనుషులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల గ్రామస్తులు బలవంతంగా శివుడిని అతడి పెద్ద కుమారుడి వద్దకు పంపించారు. అయితే అక్కడ కుమారుడు సరిగా చూడకపోవడంతో మరుసటి రోజే ఇంటికి తిరిగి వచ్చి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి గ్రామానికి వచ్చిన కుమారులను గ్రామస్తులు చితకబాదారు. 
 
మరిన్ని వార్తలు