చేనేతలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం

14 Jun, 2017 22:13 IST|Sakshi
  • చేనేత సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ చైర్మన్‌ కోదండరాం
  • అనంతపురం సప్తగిరి సర్కిల్‌:   చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని చేనేత సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ చైర్మన్‌ కోదండరాం  ఆరోపించారు.  స్థానిక చేనేత కార్యాలయం ఎదుట బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

    చేనేతలను ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకుంటున్నారన్నారు. చేనేతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే చేనేతలు లబ్ధిపొందుతున్నారన్నారు. చేనేతలకు భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు.  సిండికేట్‌ నగర్, ధర్మవరం, చిగిచెర్ల గ్రామస్థులు, నాగేంద్ర, సుధాకర్, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు