రోడెక్కిన మురుగు..కోర్టుకూ ఎక్కింది

18 Jul, 2016 08:58 IST|Sakshi
రోడెక్కిన మురుగు..కోర్టుకూ ఎక్కింది

భాకరాపేట:  తిరుపతి-బళ్లారి జాతీయు రహదారిపై నిలిచిన మురుగునీటి కథ కోర్టుకు ఎక్కింది. చిన్నగొట్టిగల్లు వుండలం పరిధిలోని టీ చట్టేవారిపాళెం పంచాయుతీలో 71 జాతీయు రహదారిపై చర్చి వద్ద మురుగునీరు నిలిచిపోవడంతో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నారుు. ఇక్కడ కొద్దిపాటి వర్షానికే భారీగా మురుగునీరు చేరడంతో ఈ ప్రాంతమంతా దుర్గంధ భరితంగా తయారై స్థానికులకు భారంగా తయారయింది. భాకరాపేట పంచాయుతీ పరిధిలో జాతీయు రహదారులు శాఖ వుురుగునీటి కాలువ నిర్మాణపు పనులు  చేపట్టింది. భాకరాపేట గ్రావుంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు వద్ద నుంచి వుురుగునీటి కాలువను తీసుకొచ్చి టీ చట్టేవారిపాళెం పంచాయుతీలోకి వదిలారు.


ఈ మురుగు నీరు ప్రస్తుతం టీచట్టేవారిపాళెం రెవెన్యూ గ్రావుంలోని చర్చి ముందు నిలిచి పోయూయి. చర్చి ముందు గతంలో కల్వర్టు ఉన్నా అది వర్షపు నీరు వెళ్లడానికే గాని, మురుగునీటి కోసం కాదనడం తో వివాదం మొదలైంది. పైగా చర్చివారు కల్వర్టు ను పూడ్చేయుడంతో వ్యవహారం వుుదిరి కోర్టుకు చేరింది. పీలేరు కోర్టు చర్చివారి వాదనలు, రెవెన్యూవారి వాదనలు విన్న తరువాత కోర్టు కమిషన్ వేసింది. అయితే శనివారం కోర్టు కమీషన్ వస్తుందని వుండల రెవెన్యూ అధికారులు ఎదురు చూశారు. మధ్యాహ్నం వరకు రాక పోవడంతో రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. కనీసం కోర్టు తీర్పుతోనైనా మురుగునీటి  కష్టం తప్పుతుందేమోనని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు