కల తీరకుండానే

21 Jul, 2016 23:11 IST|Sakshi
కల తీరకుండానే

♦ కన్నుమూశారు..
♦ ఇందిరమ్మ లబ్ధిదారుల దయనీయం
♦ సొంతింటి కల తీరకుండానే కన్నుమూత
♦ ‘సమీక్ష’లో బయటపడిన వాస్తవం
♦ ‘సాక్షి’ కథనానికి స్పందన


సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:పునాదులు తీశారు.. బేస్‌మెంట్‌ కట్టారు.. గోడలు లేపారు. పై కప్పు వేసుకుంటే ఇక గృహప్రవేశమే.. సొంతింటి కల నెరవేరబోతుందనుకున్నారు వాళ్లు.. కానీ ఏళ్లకేళ్లుగా బిల్లులు రాక.. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో దాదాపు వంద మంది చనిపోయారని, వారి ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని, ఇప్పుడు వారికి బిల్లులు చెల్లించడం సాధ్యం కాదని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందిరమ్మ  ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారని, రూ.16 కోట్ల బకాయి ఉదంటూ గు‘బిల్లు’ శీర్షికన ఈ నెల 19న ‘సాక్షి’ జిల్లా సంచికలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.. గృహ నిర్మాణంపై సమీక్ష సమావేశానికి ఆదేశించారు. ఈ మేరకు గురువారం డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం

అందోల్‌లో అదీ సంగతి!
‘అందోల్‌ ఐఏవై ఇళ్ల స్టేటస్‌ ఏమిటి? డీఈ ఎవరు? ఒకసారి లేవండి. సమావేశానికి రాలేదా?..’ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తున్నారు. ఓ ఏఈ ధైర్యం చేసి ఆందోల్‌కు రెగ్యులర్‌ డీఈ, ఇన్‌చార్జి డీఈ లేరని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆందోల్‌ నియోజకవర్గానికి రెండేళ్లుగా గృహనిర్మాణ శాఖ డీఈ లేరు. ఈ విషయం సమీక్ష సమావేశంలో బయటపడే వరకు జిల్లా కలెక్టర్‌కు కూడా తెలియదు. అందోల్‌ గృహ నిర్మాణ శాఖ డీఈ ధర్మారెడ్డిని సంగారెడ్డి నియోజకవర్గానికి డీఈగా బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. కనీసం ఇన్‌చార్జి కూడా లేకుండానే రెండేళ్లు గడవడం ఆ శాఖ పనితీరుకు అద్దం పట్టింది. 

మరిన్ని వార్తలు