అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

22 Aug, 2016 23:51 IST|Sakshi
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
నర్సంపేట : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవా రం తెల్లవారుజామున వెలుగు చూ సిం ది. స్థానికుల కథనం ప్రకారం.. అస్సాం రాష్ట్రంలోని గౌహతి పట్టణానికి చెందిన అస్లాం బాస్‌(23), అదే పట్టణానికిచెం దిన మరో ఏడుగురు కలిసి పట్టణంలో ఓ కాంట్రాక్టర్‌  వద్ద కూలి పనికి చేరారు. కాంట్రాక్టర్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ గోదాం నిర్మాణం చేపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బాస్‌తోపాటు సహచరులు కలిసి భోజ నం చేసి నిద్రకు ఉపక్రమించారు. బాస్‌ సహచరులు బసంత్‌ దాస్, మాంగ్జిత్‌ దాస్, జింపకర్‌ దాస్, కాబిన్‌దాస్, కోబిన్‌దాస్, భాస్కర్, ప్రదీప్‌దాస్, నయామ్‌ ఉదయం లేచి చూసేసరికి బాస్‌ కనిపించలేదు. నీళ్లు తీసుకురావడానికి వారుబోర్‌ వద్దకు వెళ్తుండగా కొత్తగా నిర్మిస్తున్న గోదాంలో బాస్‌ మృతదేహం కనిపించిందని, దగ్గరికి వెళ్లి చూడగా అతడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పా ల్పడినట్లు కనిపించాడన్నారు. వెంటనే కాంట్రాక్టర్‌కు, పోలీసులకు సహచరులు సమాచారం ఇచ్చారు. ఎస్సై హరికృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని కిందకు దింపి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం న ర్సంపేట మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  
మరిన్ని వార్తలు