ఇంట్లో నగదు చోరీ

17 Oct, 2016 23:30 IST|Sakshi
ఇంట్లో నగదు చోరీ
 
తెనాలిరూరల్‌ : పట్టణ బాలాజీరావుపేటలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేకుండ తాళం వేసి ఉండడం గమనించిన దుండగులు పెత్త ఎత్తున సొత్తును అపహరించుకెళ్లారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సెక్యూరిటీ గార్డుగా పని చేసే తాడిబోయిన చక్రపాణి తన కుటుంబంతో కలసి బాలాజీరావుపేటలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఈటీవల కఠెవరంలో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. ఆదివారం గమప్రవేశం చేసి, రాత్రికి అక్కడే నిద్రకు ఉన్నారు. బాలాజీరావుపేలోని ఇంటికి సోమవారం ఉదయం వచ్చిన కుటుంబసభ్యులు తాళం పగులగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా, దుండగులు బీరువాను తెరచి, అందులో ఉన్న 150 గ్రాములు బంగారు ఆభరనాలు, రూ. 50 వేల నగదు, మరి కొన్ని వెండి వస్తువులను అపహరించుకెళ్లినట్టు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో త్రీ టౌన సీఐ ఎ. అశోక్‌కుమార్, ఎస్‌ఐ పి. హజరత్తయ్య ఘటనాస్థలాన్ని పరిశలించారు. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్‌ టీం సాక్షాధారాలను సేకరించేందుకు ప్రయత్నించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 
 
 
మరిన్ని వార్తలు