కదిరిలో మళ్లీ దొంగలుపడ్డారు!

27 May, 2017 23:44 IST|Sakshi
కదిరిలో మళ్లీ దొంగలుపడ్డారు!

- వరుస చోరీలతో పోలీసులకు దొంగల సవాల్‌
- తాజాగా ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
- బెంబేలెత్తుతున్న జనం


కదిరి టౌన్‌ : కదిరిలో మళ్లీ దొంగలు పంజా విసిరారు. దైవదర్శనానికి వెళ్లిన ఉపాధ్యాయుడి ఇంట్లో పడి నగలు, నగదు ఎత్తుకెళ్లారు. కదిరి నడిబొడ్డున గల అడపాలవీధిలోని హరి అనే ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 24న తమ ఇంటి ఇలవేల్పైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు 26న ఇంటికున్న తాళాన్ని పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఇంట్లోని బీరువాను ధ్వంసం చేసి, అందులోని బంగారు నల్లపూసల దండ, నాలుగు జతల కమ్మలు, ఉంగరాలన్నీ కలిపి 15 తులాల ఆభరణాలతో పాటు రూ.5 వేల నగదుతో ఉడాయించారు. ఈ విషయాన్ని హరినాయక్‌ బంధువులు కనుగొని బాధితునికి సమాచారం అందించారు. దీంతో బాధితుడు కదిరికి వచ్చి చోరీపై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ శ్రీనివాసులు చోరీ జరిగిన ఇంటికెళ్లి పరిశీలించారు. వేలిముద్రల నిపుణులతో ఆధారాలు సేకరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు