ఆ ఏటీఎం చోరీకి విఫలయత్నం

2 Oct, 2016 22:50 IST|Sakshi
ఆ ఏటీఎం చోరీకి విఫలయత్నం

భాగ్యనగర్‌ కాలనీ: గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంను కొల్లగొట్టేందుకు విఫలయత్నం చేశారు. కూకట్‌పల్లి ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆదివారం క్రైమ్‌ ఎస్‌ఐ అనిల్‌ తెలిపిన వివరాల ప్రకారం... జయనగర్‌ కాలనీ లోని యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎం సెంటర్‌లోకి శనివారం రాత్రి మాస్కులు ధరించి ఉన్న దుండగులు ప్రవేశించారు. మిషిన్‌ ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. అది తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఈ విషయం తెలిసి పోలీసులు బ్యాంక్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరిం చారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు