వారున్నారని..మాకేం కాదనీ..!

26 Jun, 2016 02:41 IST|Sakshi
వారున్నారని..మాకేం కాదనీ..!

కనిగిరిలో ఖాకీలకు సవాల్‌గా మారిన చోరీ కేసులు
పెండింగ్‌లో విశ్రాంత ఎస్సై ఇంట్లో దోపిడీ కేసు
వీడని గొర్రెల కాపరి హత్య కేసు మిస్టరీ  
ఎర్రచందనం చోరీ కథ కంచికేనా?
యథేచ్ఛగా దొంగల చేతివాటం

అది జిల్లా జైలు. జిల్లా వ్యాప్తంగా వివిధ చోట్ల చోరీలకు పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్టు చేసి అక్కడికి పంపారు. ఓ రోజు జైలులో దొంగలంతా సమావేశమయ్యూరు. దాదాపు 200 మంది దొంగలు పోగయ్యూరు. ఇంతలో దొంగల నేత మైకు అందుకుని తన ప్రసంగాన్ని ఇలా ప్రారంభించాడు.. రానురానూ దొంగతనాలు కష్టమయ్యూరుు. ఇలా చోరీ చేసి అటు వెళ్తున్నామో లేదో వెనుకాలే పోలీసులు వచ్చి పట్టుకుని కటకటాల వెనక్కి నెడుతున్నారు. జిల్లాలో అన్ని చోట్లా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

చోరీ చేసిన సొత్తును సైతం ఇట్టే రికవరీ చేస్తున్నారని అన్నాడు. ఇంతలో ఓ దొంగ లేచి చోరీలు కష్టంగా ఉన్నాయని ఎలా చెబుతారంటూ సదరు దొంగల నేతను సూటిగా ప్రశ్నించాడు. మిగిలిన దొంగలంతా అతడి వైపు ఆసక్తిగా చూశారు. ఎవరితను.. ఎప్పుడూ చూడలేదే.. అంటూ ఒకరిలో ఒకరు గుసగుసలాడుకున్నారు.. మైకు అందుకున్న సదరు దొంగ.. తన ప్రసంగాన్ని ఇలా.. ప్రారంభించాడు..

నాది కనిగిరి. కనిగిరిలో నాతో పాటు సుమారు 20 మంది దొంగలం ఉన్నాం. మేం చాలా ఏళ్లుగా కనిగిరి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీలు చేస్తునే ఉన్నాం. ఇప్పటికీ మాలో ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకోలేదు సరికదా మా ఆనవాళ్లు కూడా వారివద్ద లేవు. చివరకు పోలీసుల ఇళ్లల్లో కూడా చోరీలు చేస్తున్నాం. మేం ఇంతవరకూ జైలుకు వెళ్లలేదు. మరి నువ్వే కేసులో ఇక్కడున్నావంటూ పెద్ద దొంగ అనుమానంగా అడిగాడు. ఓహ్.. అదా.. మొన్న ఓ పనిపై ఒంగోలు వచ్చి తిరిగి కనిగిరి వెళ్తున్నా. బస్సు ఎక్కేందుకు ఒంగోలు బస్టాండ్‌కు వెళ్లి అక్కడ ఓ మహిళ పర్సు కాజేశా. అంతే నిమిషాల్లో పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు.

పెద్ద దొంగ మళ్లీ మైకు తీసుకుని ప్రియ దొంగలరా.. ఇక్కడి నుంచి విడుదలైన తర్వాత అంద రం కనిగిరి వైపు దృష్టి సారించి దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుందాం.. అని సెలవిచ్చాడు. మిగిలిన దొంగలంతా ఆ కనిగిరి ప్రాంత దొంగను ఉద్దేశించి మాకు దారి చూపావంటూ అభినందించారు.

కనిగిరి :  కనిగిరి పరిధిలోని పలు చోరీ, హత్య కేసులు పోలీసులకు సవాల్‌గా మారారుు. కనిగిరి ప్రాంతంలో సం చలనం రేపిన పలు కేసుల్లో పురోగతి కనిపించడం లేదు. కేసులు ఏళ్ల తరబడి దర్యాప్తులో ఉండటంపై పలువురు పోలీసుల పనితీరును ప్రశ్నిస్తున్నారు.

 ఇదీ..ఎర్రచందనం దుంగల కథ
అటవీశాఖ అధికారులు కనిగిరి రేంజ్‌లోని తుంగోడు, వెదుళ్ల చెరువు, చెన్నపునాయుని పల్లె బీట్‌లలో మొత్తం రూ.10 లక్షల విలువైన 135 ఎర్రచందనం దుంగలను పట్టుకుని వాటిని కనిగిరి అటవీ కార్యాలయంలో ఉంచారు. అవి 2012 జూలై 5న మాయమయ్యూరుు. అప్పట్లో ఈ చోరీ ఘటన జిల్లాలోనే సంచలనం రేపింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఆ శాఖ అధికారులు వాచ్‌మన్‌పై సస్సెండ్ వేటు వేసి కేసును మమ అనిపించారు.

 అప్పట్లో విచారణకు వచ్చిన పోలీసు అధికారులు మాత్రం దుంగల మాయంపై ఇంటి దొంగల ప్రమేయం ఉండి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు. ఎర్రచందనం అపహరణ కేసులో తొలుత హడావుడి చేసిన ఫారెస్ట్, పోలీసు అధికారులు ఆ తర్వాత మిన్నకుండిపోయారు. ఈ వ్యవహారంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. అటవీశాఖ సబ్ డీఎఫ్‌ఓ, డీఎఫ్‌ఓ స్థాయి అధికారులు ఏడాది క్రితం అప్పటి ఎస్పీ చిరువోలు శ్రీకాంత్‌ను కలిసి ఎర్రచందనం దుంగల చోరీపై దర్యాప్తును వేగవంతం చేయూలని విన్నవించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయూలని సాక్షత్తు అప్పటి ఎస్పీ ఆదేశించినా స్థానిక పోలీసులకు చీమకుట్టినట్లు కూడా లేదు.

బంగారు ఆభరణాల దోపిడీ కేసూ అంతే
ఈ ఏడాది గత నెల 26న విశ్రాంత ఎస్సై పి.నారాయణ ఇంట్లో పోలీసు వేషధారణలో వచ్చిన దొంగలు ఆయన భార్య నాగమణిని తుపాకీతో బెదిరించి సుమారు 60 సవర్ల బంగారం, నగదు అపహరించుకెళ్లారు. ఈ ఘటన కూడా జిల్లాలో సంచలనం రేపింది. పోలీసులు, డాగ్ స్వ్కాడ్, క్లూస్‌టీం వచ్చి ఆధారాలు సేకరించినా ఫలితం లేకపోరుుంది. నిందితుల ఊహా చిత్రాలు విడుదల చేసి కేసును పలు కోణాల్లో దర్యాప్తు చే స్తున్నట్లు పోలీసులు చెప్పారేతప్ప అంతకుమించి వారు తీసుకున్న చర్యలు శూన్యం. దోపిడీ జరిగి నెల రోజులు దాడినా కేసులో ఇంకా పురోగతి లేదు.

గొర్రెల కాపరిని చంపిందెవరు?
హెచ్‌ఎంపాడు మండలంలో గొర్రెల కాపరి పెరుగు లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యూడు. ఈ కేసు కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. కొత్తూరు సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో ఆయన మృతదేహం చెట్టుకు ఉరేసినట్లు ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. మృతుని భార్య మాత్రం తన భర్తది హత్యేనని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుని జేబులు బ్లేడు, శరీరంపై గాయాలు ఉండటంతో లక్ష్మీనారాయణది హత్య? లేక ఆత్మహత్య.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. పోలీసులు అన్ని కోణాల్లో  దర్యాప్తు చేశారు. ఘటన జరిగి రెండు నెలలు దాటినా ఇప్పటికీ కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు.

దుంగల చోరీ కేసు దర్యాప్తులో ఉంది
గతంలో మా కార్యాలయంలో ఎర్రచందనం దుంగలు మాయమైంది వాస్తవమే. నేను ఇటీవలే కనిగిరికి బదిలీపై వచ్చాను. దుంగల చోరీ కేసు పోలీసుల దర్యాప్తులోనే ఉంది. రూ.10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు ఇంకా రికవరీ కాలేదు. అప్పట్లో మా శాఖలోని కొందరు సిబ్బందిపై శాఖాపర మైన చర్యలు తీసుకున్నారు.  - పోతురాజు, ఫారెస్ట్ రేంజర్, కనిగిరి

మరిన్ని వార్తలు