అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్‌

4 Nov, 2016 23:18 IST|Sakshi
అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్‌
  •  రూ.8 లక్షలు బంగారు ఆభరణాలు, లారీ స్వాధీనం  
  • సూళ్లూరుపేట : సూళ్లూరుపేట, తడ మండలాల్లో పలు చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను శుక్రవారం అరెస్ట్‌ చేసినట్లు సీఐ విజయకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిక వేణుగోపాలపురానికి చెందిన వరగంటి రమేష్‌ (28), తుపాకుల రమేష్‌ (23) సూళ్లూరుపేటలోని బస్టాండ్‌ సెంటర్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గత నెల 24న నెల్లూరు వెంకటేశ్వరపురానికి చెందిన ముగ్గురు మహిళలను నాయుడుపేటలో ఆటోలో ఎక్కించుకుని పెరిమిటిపాడు వద్ద అటవీ ప్రాంతంలో ఆపి దారి దోపిడీ చేసి యాస్మిన్‌ అనే మహిళ నుంచి బంగారు గొలుసు, కమ్మలు, సెల్‌ఫోన్‌ చోరీ చేశారు. వారి నుంచి ఆ వస్తువులను రికవరీ చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 18న తడ మండలం భీములవారిపాళెం వద్ద రోడ్డు పక్కన ఆపి ఉన్న అశోక్‌లైలాండ్‌ లారీని కూడా చోరీ చేసినట్లు విచారణలో వెల్లడి కావడంతో ఆ లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. మంగానెల్లూరు, పిచ్చాటూరు మండలంలోని అప్పంబట్టు, కేవీబీపురం పొలాల్లో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు పగలగొట్టి అందులోని కాపర్‌ వైర్లును చోరీ చేశారు. ఇందులో వరంగటి రమేష్‌పై చిత్తూరు జిల్లా సత్యవేడు, వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ, పిచ్చాటూరు, నెల్లూరు 5వ టౌన్‌ పోలీస్‌స్టేషన్లలో లారీల దొంగతనాలు కేసులు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్‌ దొంగతనాల కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ గంగాధర్‌రావు, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు. 
     
     
     
మరిన్ని వార్తలు