తిరుమల ప్రధాన అర్చకుడికి కోపమొచ్చింది

16 Oct, 2015 13:39 IST|Sakshi
తిరుమల ప్రధాన అర్చకుడికి కోపమొచ్చింది

తిరుపతి: తిరుమలలో మరోసారి అర్చకులు అధికారుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సింహవాహన ఊరేగింపులో ఆలయ పేష్కర్పై ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మండిపడ్డారు. వాహనాల డ్యూటీలను ప్రధాన అర్చకులకు తెలియకుండా మారుస్తారా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలా చేయడం తనను అవమానించినట్లే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఒకసారి ఓ అర్చకుడికి డ్యూటీ అప్పగించి నిర్ణయం తీసుకున్నాకా ఎలా మారుస్తారని ప్రశ్నించారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఊరేగిస్తున్న ఆయా వాహనాలకు ప్రత్యేక అర్చకులకు డ్యూటీలు వేశారు. అయితే, శుక్రవారం ఊరేగించిన వాహనాలకు కూడా గతంలో విధులు నిర్వర్తించిన అర్చకులే తిరిగి కనిపించడంతో రమణ దీక్షితులు అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాగే రమణ దీక్షితులు వేసిన డ్యూటీలను పేష్కార్ అధికారులు మార్పులు చేశారు.

>
మరిన్ని వార్తలు