కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభిస్తాం

28 Jul, 2016 19:16 IST|Sakshi
కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభిస్తాం

వృత్తివిద్య జిల్లా అధికారి మహమూద్‌ అలీ

పెద్దేముల్‌: ఈ విద్యాసంవత్సరంలోనే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తామని వృత్తివిద్య జిల్లా అధికారి మహమూద్‌ అలీ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలోని 27 ప్రభుత్వ కళాశాలలను తనిఖీ చేశామన్నారు. గతేడాదికంటే ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో 30 శాతం అడ్మిషన్లు పెరిగాయన్నారు. ప్రైవేట్‌ కళాశాలలకంటే ప్రభుత్వ కళాశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. దానికి తోడు బయోమెట్రిక్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. పేదలకు చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల విద్యార్థులకు వసతులు కల్పిస్తుందన్నారు. అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. పెద్దేముల్‌ కళాశాలలో రూ.కోటి 30 లక్షలతో అదనపు గదులు ఏర్పాటు చేస్తామన్నారు. కళాశాలలో్ ఈ-లైబ్రరీ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆయనతో పాటు కళాశాల ప్రిన్సిపాల్‌ నర్సింలు, లెక్చరర్లు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు