ముగ్గురూ..ముగ్గురే..

19 Feb, 2017 01:48 IST|Sakshi
ముగ్గురూ..ముగ్గురే..
కూలీలను పీక్కుతింటున్న సామంతులు
(లక్కింశెట్టి శ్రీనివాసరావు)
ఒకప్పుడు బొబ్బిలి వంశంలో తాండ్రపాపారాయుడు ఏలిన మెట్ట సామ్రాజ్యమది. ఆ సామ్రాజ్యంలో ఏ పంట వేసినా పండేది కాదు. ఆప్పట్లో ప్రజలు కరువుతో కటకటలాడిపోయి తినడానికి తిండి గింజలు కూడా ఉండేవి కావట. ఏ పంట వేసినా పాడైపోతూనే ఉండేవట. ఆ రాజ్యంలో
‘ప్రతీదీ పాడే’ అని కన్నీరుపెట్టే వారట. అందుకే ఆ రాజ్యం పేరు కూడా ప్రతీదీ పాడేలా మారిపోయింది. అటువంటి రాజ్యాన్ని ఇప్పుడు ఏలుతున్న మెట్ట రాజుకు ముగ్గురు శిషు్యలు. వారు మూడు పరగణాలను  గుప్పెట్లో పెట్టుకున్నారు. ముగ్గురిలో పెద్దపల్లి  సామంతుడు రాజుకు అత్యంత ఆప్తుడు. రెండో సామంతుడు ఈ రాజ్యాన్ని ఏలి దివంగతుౖడైన ఒక చిట్టిబాబు రాజుకు ఆంతరంగికుడిగా పనిచేయగా, మూడో సామంతుడు చిన్నపాటి పరగణాకు పాల కుడు. రాజు ముగ్గురికీ మూడు పరగణాలు రాసి ఇచ్చేయగా జ నంపై పడి పీక్కుతింటున్నారు. ఆ రాజ్యంలోనిదే ఒక గ్రామం. దానిపేరు చిన్నిపేట. చంద్రవంశరాజు నిర్మిస్తానంటున్న అమరావతి రాజధానికి అది 250 కిలోమీటర్లు దూరంలో ఉంది.
జలగలను తలపిస్తూ...
అమరావతిలో చంద్రవంశ రాజు రైతుల భూములను అడ్డంగా లాగేసుకుంటుంటే ఇక్కడ సామంతులు కూలీల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. చిన్నిపేటలో థాయిలాండ్‌ రాజు ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేశాడు. అమెరికా రాజ్యానికి డాలర్లు కురిపించే రొయ్యల కడుపునింపే కర్మాగారాన్ని పెట్టారు. దానివల్ల రాజ్యంలో కాలుష్యంతో అనారోగ్యాలపాలవుతారని ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న మెట్ట రాజు, సామంతులు థాయిలాండ్‌ రాజ్యంపై ప్రజలతో కలిసి తిరుగుబాటు చేసి పెద్ద పేరు సంపాదించారు. చూసిన జనం రాజు, సామంతులు ఎంత మంచి పనిచేస్తున్నారో అని సంబరాలు చేసుకున్నారు. జనానికి ఆ సంబరాలు ఎన్నో రోజులు నిలవలేదు. ఎందుకంటారా ప్రజలకు తెలియకుండా  మెట్ట రాజు, సామంతులు కలిసిపోయి విదేశీయులతో రహస్య ఒప్పందం చేసుకున్నారు. అదేంటంటే ఆ కర్మాగారం జోలికి ప్రజలు రారని లేఖ ఇచ్చారు. ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి కర్మాగారానికి ఎటువంటి ఆటంకం ఉండదని ప్రజల తరఫున మెట్టరాజు, ముగ్గురు సామంతులు వేగుల ద్వారా ఒప్పంద పత్రాలు పరస్పరం మార్చుకున్నారు.
కూలీల సొమ్ములో కక్కుర్తి...
కర్మాగారంలో పనికి ఆ రాజ్యంలోని పరిసర పల్లెల నుంచి 200 మంది కూలీలను పంపిస్తున్నారు. కూలీలను పంపించడం, వారికి జీత భత్యాలు ఇవ్వడంలో ముగ్గురు సామంతులదే పెత్తనం. అంటే నేరుగా థాయిలాండ్‌ ప్రతినిధులతో కూలీలకు ఎంటువంటి సంబంధం లేదన్న మాట. ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లే కూలీలు సాయంత్రం ఆరు గంటల వరకు రెక్కలు ముక్కలు చేసుకుని అందులో పనిచేస్తున్నారు. పనికి వెళ్లే వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు, బలహీన వర్గాలే. ఎగుమతి, దిగుమతి, క్లీనింగ్, రసాయనాల మిశ్రమాలు కలపడం, చుట్టూ గార్డె¯ŒS శుభ్రం చేయడం...ఇలా రకరకాల పనులు చేస్తున్నారు. ఇలా ఎనిమిది గంటలు పనిచేసే కూలీకి థాయ్‌ల్యాండ్‌ కంపెనీ రూ.428 చొప్పున కూలీ డబ్బును సామంతుల చేతిలో పెడుతోంది. నేరుగా కూలీల చేతిలో పెట్టొచ్చు. కానీ ఆ ముగ్గురు సామంత రాజులు, థాయ్‌ ప్రతినిధుల మధ్య గత మార్చిలో జరిగిన రహస్య ఒప్పందంతో కూలీలకు జీతం నేరుగా వెళ్లడం లేదు. ఒక్కో కూలీకి రూ.428 కూలీ సామంత రాజుల చేతిలో పెడితే వారు రూ.128లు కప్పంగా జమ చేసుకుంటున్నారు. మిగిలిన రూ.300లే కూలీలకు ఇస్తున్నారు. అలా ఒక్కొక్క కూలీ వద్ద రోజుకు రూ.128లు చొప్పున నెలకు రూ.3840లు సామంతులు నొక్కేస్తున్నారు. అలా 200 మంది కూలీల వద్ద నెలకు సుమారు రూ.7.87 లక్షలు సామంతుల జేబుల్లోకి పోతోంది.
ఇలా కూలీల రెక్కల కష్టాన్ని దోచుకుంటుండగా థాయ్‌ ప్రతినిధులతో చేసుకున్న ఒప్పంద గడువు దగ్గరపడింది. ఆ ప్రాంతంలో రైతులకు మేలు చేయాలని థాయ్‌ ప్రతినిధులపై రాజు, సామంతులు సైన్యాన్ని వెంటేసుకు వెళ్లి మరోసారి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఎన్నో సముద్రాలు దాటి వచ్చిన ఆ థాయ్‌ ప్రతిని««దlులకు వారిని ఎదుర్కొనే సత్తా లేక వారు చెప్పినట్టే కూలీల ఒప్పందాన్ని పొడిగించారు. ఆ రాజు, ముగ్గురు సామంతులు సంతోషంగా గుర్రంపై స్వారీ చేస్తూ తిరిగి అంతఃపురానికి చేరుకున్నారు. ఇంతలో నాలుగు మాసాలుగా నిగ్రహం వహించిన జనం నుంచి ముగ్గురు సామంతుల దోపిడీపై మొదలైన తిరుగుబాటుకు ఎర్రజెండాలు కూడా తోడయ్యాయి. ప్రజా తిరుగుబాటుపై రాజు, సామంతులకు ఎప్పటికప్పుడు వేగులు సమాచారాన్ని సేకరించి చెవిలో వేస్తున్నారు. ఇలా ఎంతకాలం ఈ దోపిడీ జరుగుతుందో,  ఎప్పటికి ఈ పాలనకు తెరపడుతుందా అని జనం రచ్చబండలపై చర్చించుకుంటున్నారు.
 
మరిన్ని వార్తలు