వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

8 Feb, 2017 22:14 IST|Sakshi
 డోన్‌ టౌన్‌ : మండల పరిధిలోని వెంకటాపురం గ్రామ శివారులో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణగిరి మండలం బోయ బొంతిరాళ్లకు చెందిన హరిజన నరసింహులు (50)  తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు రూరల్‌ ఎస్‌ఐ రామసుబ్బయ్య తెలిపారు. సొంతపని మీద డోన్‌కు వచ్చి తిరిగి స్వగ్రామానికి బైక్‌(ఏపీ21బీసీ5399)  పై వెళ్తుండగా వెంకటాపురం గ్రామ శివారులో గుర్తుతెలియని కారు  వెనుకవైపు నుంచి ఢీ కొనడంతో ప్రమాదం జరిగిందని మృతుని భార్య ఓబులమ్మ ఫిర్యాదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు. 
 
బైక్‌ ప్రమాదంలో..
రుద్రవరంః మండలంలోని ముత్తలూరు సమీప మలుపువద్ద బైక్‌ ప్రమాదంలో మేకల నాగ ఓబులేసు(25) మృతి చెందగా బాషాకు తీవ్రగాయాలయ్యాయని ఎస్‌ఐ హనుమంతయ్య తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఆళ్లగడ్డ మండలం ఆర్‌ జంబులదిన్నె గ్రామానికి చెందిన మేకల నాగ ఓబులేసు, బాషా  ఇద్దరూ బైక్‌పై మంగళవారం అర్ధరాత్రి సమయంలో నర్సాపురం వైపు నుంచి స్వగ్రామానికి వేగంగా వెళ్తుండగా  ముత్తలూరు మలుపు వద్ద ప్రమాదం చోటు చేసుకుందన్నారు. నాగ ఓబులేసు అక్కడికిక్కడే మృతి చెందగా బాషాకు తీవ్రగాయాలయ్యాయని వివరించారు. బాషాను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించామన్నారు. మృతినికి భార్య వరలక్ష్మి కుమార్తె కుమారుడు ఉన్నారన్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. 
ఆర్టీసీ బస్సు ఢీకొని..
 నంద్యాల: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఢీకొని ఓబులేసు మృతి చెందాడని వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. గోస్పాడు మండలం పసురపాడు గ్రామానికి చెందిన ఓబులేసు నంద్యాలకు వచ్చి పనులు పూర్తి చేసుకొని తిరిగి గ్రామానికి వెళ్లడానికి బస్టాండ్‌కు వెళ్లగా బస్సు ఢీకొందని చెప్పారు. తీవ్రంగా గాయపడడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించినా కోలుకోలేక మృతి చెందాడని వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేస్తామన్నారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు