‘తీన్’మార్

20 May, 2016 02:16 IST|Sakshi
‘తీన్’మార్

మూడు జిల్లాలుగా విభజించాలని ప్రతిపాదనలు
రెవెన్యూ, పోలీస్ విభాగాలు కలిసి సమర్పణ
మండలం యూనిట్‌గా డీలిమిటేషన్
గుట్టుగా సర్కారుకు మరిన్ని ప్రతిపాదనలు
మొదటి నుంచీ అనుకున్నట్టే ‘వికారాబాద్’
రాజధాని సహా షాద్‌నగర్,
భువనగిరితో నాలుగు జిల్లాల ఏర్పాటు

జిల్లా మూడు ముక్కలుగా విడిపోనుంది.  పునర్విభజనలో జిల్లాను మూడు జిల్లాలుగా విభజించేలా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే, తొలుత అనుకున్నట్లు నియోజకవర్గాలవారీగా కాకుండా మండలాలను యూనిట్‌గా చేసుకొని డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రతిపాదనలేకాకుండా మరికొన్నింటిని గుట్టుగా ప్రభుత్వానికి నివేదించింది. దీంట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజనను ఆధారంగా చేసుకొని నయా జిల్లాలను ప్రతిపాదించింది. 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రాంతాలేకాక.. షాద్‌నగర్, భువనగిరిని కూడా కలుపుకొని జిల్లా యంత్రాంగం పునర్విభజన కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వ పెద్ద మనోగతానికి అనుగుణంగా ఈ జిల్లాల మ్యాప్‌లను సైబ రాబాద్ పోలీస్ కమిషనర్, కలెక్టర్ సంయుక్తంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు కొత్త జిల్లాల స్వరూపం, సరిహద్దులపై ఈ ఇరువురి ప్రభుత్వానికి నివేదిక  ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలకే దాదాపుగా పచ్చజెండా ఊపే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను రెండుగా విభజించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయిం చింది.

ఈ క్రమంలోనే తెలంగాణ తిరుమలగా అభివర్ణిస్తున్న యాదాద్రిని కూడా కొత్త కమిషనరేట్ల పరిధిలోకి తీసుకురావాలని యోచించింది. అందులో భాగంగానే నగరానికి చేరువలో ఉన్న భువనగిరి, అదే తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న షాద్‌నగర్‌ను కూడా కలుపుకొని విభజన పర్వాన్ని చేపట్టే దిశగా ఆలోచన చేస్తోంది.భువనగిరి పరిధిలో ఇబ్రహీంపట్నం, మే డ్చల్ సెగ్మెంట్లను పొందపరచాలని,శంషాబాద్ కేం ద్రంగా షాద్‌నగర్.. చార్మినార్‌లోకి మహేశ్వరంను చేర్చే లా ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా మినహా రంగారెడ్డి, హైదరాబా ద్ జిల్లాల పరిధిలో నూతన ంగా నాలుగు జిల్లాలను ఏ ర్పాటు చేయాలనే కోణంలో మల్లగుల్లాలు పడుతోంది.

 మూడు జిల్లాలివే..
ఇదిలావుండగా, ప్రస్తుత జిల్లాను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. వికారాబాద్, రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం పేరిట ఈ జిల్లాలు ఉంటాయని స్పష్టం చేసింది. మండలాలను యూనిట్‌గా చేసుకొని వీటికి తుదిరూపు ఇచ్చారు. మొదట భావించినట్లు వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొనసాగుతుందనే ప్రచారానికి తెరదించుతూ వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా నిర్వచించింది. అయితే, జిల్లా కేంద్రాల ప్రకటనను మాత్రం ప్రభుత్వం విచక్షణకే వదిలేసింది.

మరిన్ని వార్తలు