ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన లారీ: ముగ్గురికి గాయాలు

19 Dec, 2015 08:15 IST|Sakshi

నల్గొండ : నల్గొండ జిల్లా నార్కట్పల్లి శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని మరో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంది. ఈ నేపథ్యంలో పొగమంచు కారణంగా రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడపోవడం జరుగుతుంది పోలీసులు తెలిపారు. ఆ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు