పులులుంటేనే వాతావరణంలో సమతుల్యం

29 Jul, 2016 22:39 IST|Sakshi
ర్యాలీ తీస్తున్న అధికారులు
  • టైగర్‌జోన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రవీందర్‌
  • అంతర్జాతీయ పులుల దినోత్సవ ర్యాలీ
  • జన్నారం : పులులతో వాతావరణంలో సమతుల్యత ఉంటుందని, దీంతో మనిషి మనుగడకు ముప్పు వాటిల్లే కాలుష్యం నివారణ అవుతుందని టైగర్‌జోన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రవీందర్‌ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం పురష్కరించుకుని మండల కేంద్రంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా టీడీసీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కవ్వాల్‌ టైగర్‌జోన్‌ కావడం వల్ల ఈ ప్రాంతంలో పులులు వచ్చాయని, వాటి రాక శుభపరిణామమని అన్నారు. పులులను కాపాడుకోవడం అందరి బాధ్యతని, పులులు ఈ ప్రాంతంలో ఉండాలంటే అడవులను సంరక్షించుకోవాలని తెలిపారు. అడవులు దట్టంగా ఉండడం వల్ల శాఖాహార జంతువులు ఉంటాయని, వాటితో పులుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు.
     
    త్వరలో పులులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని, అందుకు తగ్గినట్లుగా కారిడర్‌ తయారు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చెటుపల్లి రాజేశ్వరి, రేంజ్‌ అధికారి సౌకత్‌ హుస్సెన్, ఎన్‌సీసీ అధికారి రాజమౌళి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుర్రం రాజరాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం, పట్టణ అధ్యక్షుడు భరత్‌కుమార్, డీఆర్వో గులాం మొయినొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు