29 వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు

26 Sep, 2016 21:30 IST|Sakshi
29 వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
గుంటూరు (నగరంపాలెం): సత్తెనపల్లి, పిడుగురాళ్ళ మధ్యలో  కొట్టుకుపోయిన  రైల్వే ట్రాకు పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున  డివిజను పరిధిలో  గురువారం (29.09.2016)వరకు  పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేసినట్టు గుంటూరు రైల్వే డివిజను సీనియర్‌ డివిజనల్‌ మేనేజరు కె. ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.  28, 29 తేదీలలో  ట్రైన్‌ నం: 77676/77677 మిర్యాలగూడ– పిడుగురాళ్ళ– పిడుగురాళ్ళ ప్యాసింజరు,  ట్రైన్‌ నం : l12747/12748 గుంటూరు– వికారాబాద్‌– గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్, ట్రైన్‌ నం : 57319/57320 గుంటూరు– మాచర్ల– గుంటూరు ప్యాసింజరు, ట్రైన్‌ నం : 57317 గుంటూరు– మాచర్ల ప్యాసింజరు, ట్రైన్‌ నం : 57323/57324  నడికుడి– మాచర్ల– నడికుడి ప్యాసింజరును, ట్రైన్‌ నం 12795/12796 విజయవాడ– సికింద్రాబాద్‌– విజయవాడ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. 28, 29 తేదీలలో   ట్రైన్‌ నం: 57620 కాచిగూడ– రేపల్లె డెల్టా ప్యాసింజరు కాచిగూడ –గుంటూరు మధ్యలో,  ట్రైన్‌ నం : 57619 రేపల్లె– సికింద్రాబాద్, ట్రైన్‌ నం: 57651/127652 సికింద్రాబాద్‌– రేపల్లె– సికింద్రాబాద్‌  ప్యాసింజరును గుంటూరు,సికింద్రాబాద్‌ మధ్యలో, ట్రైన్‌నెం 57318 మాచర్ల– బీమవరం ప్యాసింజరు గుంటూరు– మాచర్ల మధ్యలో పాక్షికంగా రద్దు చేశారు.
 
దారి మళ్ళించిన రైళ్లు..
27, 28, 29 తేదీలలో ట్రైన్‌నెం 12603  చెన్నై–హైద్రాబాద్, 28,29 తేదీలలో ట్రైన్‌నెం 12604 హైద్రాబాద్‌–చెన్నై   చెన్నై ఎక్స్‌ప్రెస్, 28, 29 తేదీలలోట్రైన్‌నెం 12734/12733 సికింద్రాబాద్‌– తిరుపతి– సికింద్రాబాద్‌ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌  ఖాజీపేట, విజయవాడ, న్యూగుంటూరు స్టేషను మీదుగా తెనాలి వైపునకు దారిమళ్ళించారు. 27,28 తేదిలలో ట్రైన్‌నెం 17229 తివేండ్రమ్‌–హైద్రాబాద్‌ శబరి ఎక్స్‌ప్రెస్, 28, 29 తేదీలలో ట్రైన్‌ నెం 17230 హైద్రాబాద్‌– తివేండ్రమ్‌ శబరి ఎక్స్‌ప్రెస్, 28, 29 తేదీలలో ట్రైన్‌నెం 17016 భువనేశ్వర్‌– సికింద్రాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్, 27,28 తేదీలలో ట్రైన్‌నెం 17015 సికింద్రాబాద్‌– భువనేశ్వర్‌  విశాఖ ఎక్స్‌ప్రెస్‌ , 28,29 తేదిలలో ట్రైన్‌నెం 12704 సికింద్రాబాద్‌– హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, 27,28 తేదిలలో ట్రైన్‌నెం 12703 హౌరా– సికింద్రాబాద్‌  ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, 28,29 తేదీలలో ట్రైన్‌నెం 12805/12806 విశాఖపట్నం– సికింద్రాబాద్‌– విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ,28,29 తేదిలలోట్రైన్‌నెం 17255/17256  నర్సాపూర్‌–ౖ హెద్రాబాద్‌– నర్సాపూర్, నర్సపూర్‌ ఎక్స్‌ప్రెస్, 28వతేది ట్రైన్‌నెం 17221 కాకినాడపోర్టు– లోకమాన్యతిలక్‌ ఎక్స్‌ప్రెస్, 29వ తేదీ కాకినాడ పోర్టు– భావనగర్‌ ఎక్స్‌ప్రెస్, 27వ తేదీ ట్రైన్‌నెం 07439 టాటా– కాచీగూడ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఖాజీపేట మీదుగా విజయవాడ వైపు దారి మళ్లించారు.
మరిన్ని వార్తలు