సస్యరక్షణకు సమయమిదే..

11 Aug, 2016 18:12 IST|Sakshi
ఎర్రవల్లిలో పంటలను పరిశీలిస్తున్న జేడీ మాధవిశ్రీలత
  • సోయాబీన్‌కు తెల్లదోమ బెడద
  • ఆందోళన అవసరం లేదు
  • వ్యవసాయ జిల్లా ఉపసంచాలకులు మాధవి శ్రీలత
  • జగదేవ్‌పూర్‌: రైతులు పంటల సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని జిల్లా వ్యవసాయ సంచాలకులు మాధవిశ్రీలత అన్నారు. గురువారం సాయంత్రం సీఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సాగవుతున్న సోయాబీన్‌ పంటలను జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్‌తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు గ్రామాల్లో సోయాబీన్ సంటలు బాగానే ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

    సోయాబీన్‌ పంటలను సాగు చేసిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పంటలు ఆర్థిక వయో పరిమితి దశలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం వర్షాలు లేనందున్న పంటలకు తెల్లదోమ సోకే అవకాశం ఉందని, దోమ నివారణకు రైతులు తగిన పురుగుల మందులను కొట్టాలన్నారు. లార్వీన్‌, అవైట్‌, రీమాన్‌లాంటి మందులను పంటలకు పిచికారీ చేయాలని సూచించారు. వర్షం కురిసిన వెంటనే పంటలకు పోటాషియం వేయాలన్నారు. కార్యక్రమంలో వీడీసీ గౌరవ అధ్యక్షులు బాల్‌రాజు, ఏఓ నాగరాజు, ఏఈఓ దామోదర్‌, గ్రామ రైతులు సత్తయ్య, ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు