మా కష్టాలు తీర్చండి

30 Aug, 2016 23:32 IST|Sakshi
  • ఇళ్లు, పింఛన్లు, కరెంట్‌ లేవు
  • బాత్‌రూంలు లేక ఆరుబయటే స్నానాలు
  • కలెక్టర్‌కు సమస్యలు విన్నవించిన పిట్టలగూడెం వాసులు 
  • రఘునాథపల్లి : ఇళ్లు.. నీళ్లు లేవు.. పింఛన్లు ఇవ్వడం లేదు. కరెంటు లేక  కటిక చీకట్లోనే కా లం వెళ్లదీస్తున్నాం. తమ జీవితాలు ఆగమ్యగోచరంగా ఉన్నాయి. మా కష్టాలు తీర్చండి అం టూ జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ వద్ద మండలంలోని భాంజీపేట గ్రామ శివారు పిట్టలగూడెం వాసులు గోడు వెళ్లబోసుకున్నారు. పలు శాఖల అధికారులతో కలెక్టర్‌ మంగళవారం గూడెంను సందర్శించి ఆలయం ఎదుట నేల పైనే కూర్చొని గంటసేపు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇరుకు గదుల్లో 10 నుంచి 15 మంది బతుకుతున్నాం. తాగునీరు లేక అవస్థలు పడుతున్నాం. బాత్‌రూంలు లేక పాత చీరలతో గుడారాలు ఏర్పాటు చేసుకొని స్నానాలు చేస్తున్నాం. వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం లేదని కలెక్టర్‌కు గూడెం వాసులు మొరపెట్టుకున్నారు.
     
    చలించిన కలెక్టర్‌ సత్వర చర్యల కోసం అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పింఛన్లు మంజూరు చేసేందుకు అర్హులను గుర్తించాలని, గూడెంలో 20 మరుగుదొడ్లు వెంటనే నిర్మించాలని ఎంపీడీఓ బానోతు సరితను ఆదేశించారు. గతంలో గూడెం వాసులు కొనుగోలు చేసిన భూములకు పట్టాలివ్వాలని తహసీల్దార్‌ రవిచంద్రారెడ్డిని ఆదేశించారు. తాగునీటి కోసం గూడెంలో బోరు, వ్యవసాయ భూముల్లో సాగు చేసేం దుకు మరో బోరు పాయింట్‌ను జియాలిస్ట్‌లతో గుర్తించి వేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈని, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
     
     
    వేట మానండి.. ఉపాధి కల్పిస్తాం 
    అడవికి వెళ్లి జంతువులను వేటాడడం మానుకోవాలని మెరుగైన జీవనం కోసం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. గూడెంలో బాల వికాస స్వచ్ఛంద సంస్థచే మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు,  మేకల పెంపకానికి వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదు లు, అంగన్‌వాడీ కార్యకర్త నియామకం, ప్రత్యే క వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పరిమిత కుటుంబం కోసం కుటుంబ నియంత్రణ పాటించాలన్నారు. పిట్టలగూడెంను సా మాజిక దృక్పధంతో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మా జీ సభ్యుడు రాజారపు ప్రతాప్‌ దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు.  చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ కె.అనితారెడ్డి, ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ బానోతు శారద, గిరిజన సంక్షేమ అధికారి చందన పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు