తిరువీధుల్లో మెరిసిన కరుణాంతరంగుడు

17 Oct, 2016 00:10 IST|Sakshi
తిరువీధుల్లో మెరిసిన కరుణాంతరంగుడు
ద్వారకాతిరువుల : కోరిన కోర్కెలు తీర్చే చినవెంకన్న ఉభయ దేవేరులతో కలసి రథంపై తిరువీధుల్లో విహరించారు. ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీవారి రథరంగ డోలోత్సవం భక్తులకు నేత్రపర్వమైంది. రథంపై శ్రీదేవీ, భూదేవిలతో కొలువుతీరిన కరుణాంతరంగుని వీక్షించిన భక్తజనులు పరవశించిపోయారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నావుస్మరణలు, ఆగమ విద్యార్థుల వేద ఘోషల నడువు శ్రీవారి రథయాత్ర ఆద్యంతం భక్తులను అలరించింది. ఉదÄýæుం నుంచి ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీహరి కళా తోరణంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. 
వైభవం.. డోలోత్సవం 
శ్రీవారి తిరుకల్యాణ వుహోత్సవం జరిగిన వురుసటి రోజు రథోత్సవాన్ని జరపడం ఇక్కడ సంప్రదాÄýæు బద్ధమైంది. బ్రహ్మోత్సవాల సవుÄýæుంలో స్వామివారికి భక్తులు స్వÄýæుంగా సేవ చేసుకునే భాగ్యం ఈ రథవాహనం ద్వారానే కలుగుతుంది. శ్రీవారికి ఎంతో ప్రీతికరమైనది కావడంతో ఈ రథోత్సవ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా రాత్రి ఆలయంలో ఉభÄýæు దేవేరులతో శ్రీవారిని తొళక్కం వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. అనంతరం అర్చకులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సవుర్పించారు. ఆ తరువాత మేళతాళాలు, వుంగళ వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకులు, పండితులు, ఆగవు విద్యార్థుల వేద వుంత్రోచ్ఛరణల నడువు వాహనాన్ని రథం వద్దకు అట్టహాసంగా తీసుకువచ్చారు. రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణవుూర్తులను ఉంచి విశేష పుష్పాలంకారాలు చేసి హారతులిచ్చారు. ఆ తరువాత విశేష వాయిద్యాలు, చిత్రవిచిత్ర వేషధారణలు, డప్పువాయిద్యాలు, కోలాట భజనలతో శ్రీవారి రథం భక్తుల గోవింద నావుస్మరణలతో క్షేత్రపురవీధుల్లో తిరుగాడింది. ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ ఎస్వీపీజే గోపాలరావు, ఈవో వేండ్ర త్రినాథరావు దంపతులు రథానికి బలిహరణ సవుర్పించిన అనంతరం రథయాత్ర ప్రారంభమైంది. ఈవో త్రినాథరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 
బ్రహ్మోత్సవాల్లో నేడు 
lఉదయం 8 గంటలకు – భజన సంకీర్తనలు
lఉదయం 9 గంటలకు – భక్తి రంజని
lఉదయం 10.30 గంటలకు – చక్రవారి, అపబృదోత్సవం
lమధ్యాహ్నం 3 గంటల నుంచి – వేద సదస్సు
lసాయంత్రం 5 గంటలకు – ఉపన్యాసం
lసాయంత్రం 6 గంటలకు భరతనాట్యం 
lరాత్రి 7 గంటల నుంచి – పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ
lరాత్రి 8 గంటల నుంచి – శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం నాటకం
lరాత్రి 8 గంటల నుంచి  గ్రామోత్సవం
 
మరిన్ని వార్తలు