నారాయణరావును ఆదర్శంగా తీసుకోవాలి

24 Jul, 2016 20:03 IST|Sakshi
నారాయణరావును ఆదర్శంగా తీసుకోవాలి
చింతపల్లి : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మునుగోడు మాజీ శాసనసభ్యుడు ఉజ్జిని నారాయణరావును ఆదర్శంగా తీసుకుని నేటి యువత ఉద్యమించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని ఘడియగౌరారంలో ఉజ్జిని నారాయణరావు స్మారక స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారన్నారు.  మూడు పర్యాయాలు మునుగోడు నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించి పేద ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేసి అందరి మనసుల్లో నిలిచారన్నారు. పేద ప్రజలకు భూములు పంచాలని ఎర్ర జెండా పక్షాన ఉద్యమాలు నిర్వహించారని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణరావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ ఇచ్చే పిలుపుల్లో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వాలు, పాలకులు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఐ మాజీ శాసనసభాపక్షనేత గుండా మల్లేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు రావుల వెంకటయ్య, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు, బొమ్మగోని ప్రభాకర్, కందిమళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ఉజ్జిని యుగంధర్‌రావు, పల్లా నర్సింహారెడ్డి, నేలకంటి సత్యం, సృజన, చిలుకూరు జెడ్పీటీసీ శివాజీనాయక్, చంద్రశేఖర్, అంజయ్యనాయక్, ఆరెకంటి మైసయ్య, ముచ్చర్ల మల్లయ్య, శ్రీనివాస్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పల్లె నర్సింహ, లక్ష్మయ్య, కళాకారులు జగన్, శ్రీనివాస్, సంజీవ, పాండురంగారావు, రాజు తదితరులు పాల్గొన్నారు. 
పలువురు నేతల పరామర్శ 
 ఉజ్జిని నారాయణరావు కుటుంబాన్ని ఆదివారం పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పరామర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. పరామర్శించిన వారిలో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ నేనావత్‌ బాలునాయక్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్, మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులున్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు