హరితహారాన్ని కొనసాగించాలి

15 Oct, 2016 21:17 IST|Sakshi
హరితహారాన్ని కొనసాగించాలి
వలిగొండ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగాలని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. అనంతరం శిథిలావస్థకు చేరి ఖాళీగా ఉన్న ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌లో మొక్కను నాటారు. శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలను చేరుకుని విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో వర్షం నీరుతో సహా వృథా కాకుండా చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. హరితహారంలో పెంచుతున్న మొక్కలను చూశారు. ఈ సందర్భంగా ఆమెను పాఠశాల సిబ్బంది సన్మానించారు. ఆ తర్వాత  అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరుగుదొడ్లు 100 శాతం పూర్తయ్యేలా, మిషన్‌ భగీరథను త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్‌ ఆర్డీఓ మహేందర్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎంపీపీ కుంభం వెంకట్‌పాపిరెడ్డి, జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, తహసీల్దార్‌ అరుణారెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీఓ గిరిబాబు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పబ్బు ఉపేందర్, ఉపాధ్యక్షుడు కాసుల కృష్ణ, డాక్టర్‌ సుమన్‌కల్యాణ్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఎంఈఓ విజయారావు, ఏపీఓ ఇమ్మానీయేల్, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు.  
 
>
మరిన్ని వార్తలు