నేడు కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ పరీక్ష

5 Nov, 2016 23:59 IST|Sakshi
– పకడ్బందీగా ఏర్పాట్లు
 
కర్నూలు: కానిస్టేబుళ్ల ఎంపికకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. జిల్లా పోలీసు శాఖలో 221 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం 40,024 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒకే రోజు 40,024 మంది హాజరు కానున్నందున పోలీసు అధికారులు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. కర్నూలులో 35 సెంటర్లలో 22,630 మంది, నంద్యాలలో 32 సెంటర్లలో 17,334 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 67 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బయోమెట్రిక్‌ హాజరుతో పరీక్షకు అనుమతించనున్నారు. ఉదయం 9గంటలకల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
 
ఏపీపీఎస్‌సీ, ఏఈ పోస్టులకు రాత పరీక్ష
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు పోస్టుల నియామకానికి రాత పరీక్షలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సివిల్, మెకానికల్‌ అభ్యర్థులు 4,251 మంది పరీక్షకు హాజరవుతున్నారు. కర్నూలులో 8 కేంద్రాలు, ఆదోనిలో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక‌్షన్‌ విధించారు.
 
మరిన్ని వార్తలు