నిబంధనలు కచ్చితంగా పాటించాలి

15 Oct, 2016 21:33 IST|Sakshi
నిబంధనలు కచ్చితంగా పాటించాలి
భువనగిరి అర్బన్‌ : వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాచకొండ కమిషనరేట్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ డీసీపీ ఎన్‌.దివ్యచరణ్‌రావు అన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ ఆదేశాల మేరకు యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిలో ఇప్పటివరకు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ లేన్నందున్న స్టేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఒక ఎస్‌ఐ, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, 10 మంది కానిస్టేబుళ్లను, భువనగిరిలో ప్రస్తుతం ఉన్న ఒకట్రాఫిక్‌ ఎస్‌ఐ, 5 కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారని చెప్పారు. ముందుగా ఒక వారం రోజులపాటు ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. భవిష్యత్‌ ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రధానంగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఎదురుగా వచ్చే వారికి  ఇబ్బంది కలిగించ వద్దని సూచించారు. రికార్డుల ప్రకారం వారానికి రెండుసార్లు డీడీని కండెక్ట్‌ చేయడంతోపాటు త్రిబుల్‌ రైడింగ్, హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడపడం, పార్కింగ్‌ సమస్య, డేంజరస్‌ డ్రైవింగ్‌ నివారించడం జరుగుతుందన్నారు. ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. భువనగిరితో పాటు చౌటుప్పల్‌లో కూడా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చే సినట్లు ఆయన తెలిపారు. అనంతరం యాదాద్రి జిల్లా డీసీపీ పి.యాదగిరి మాట్లాడుతూ ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా భువనగిరిలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏసీపీ జీవీ. శ్యాంసుందర్‌రెడ్డి, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శంకర్‌గౌడ్, ఉప్పల్‌ ట్రాఫిక్‌ సీఐ ఇ.జంగయ్య, ట్రాఫిక్‌ ఎస్‌ఐలు లాచ్చిరాం, హన్మంత్‌లాల్, సిబ్బంది ఉన్నారు.  
 
మరిన్ని వార్తలు