స్పీడ్‌ బ్రేకర్లను మరిచారా..?

12 Aug, 2016 19:14 IST|Sakshi
స్పీడ్‌ బ్రేకర్లను మరిచారా..?
 సందర్భంగా మిర్యాలగూడ–నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిని మరమ్మతులు చేయడంతోపాటు డివైడర్లకు, కల్వర్టులకు రంగులు వేశారు. కానీ ప్రమాదకరంగా మారిన స్పీడ్‌బ్రేకర్లను మాత్రం మరిచి పోయారు. స్పీడు బ్రేకర్లు ఉన్నట్లుగా ఎక్కడా ఒక్క సూచికబోర్డుకు ఏర్పాటు చేయలేదు. దీంతో సాగర్‌–మిర్యాలగూడ రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి మీదుగా దూరప్రాంతాల నుంచి వచ్చే వారు సమీపంలోకి వచ్చే వరకు స్పీడు బ్రేకర్‌ ఉన్నట్లు తెలియక తమ వాహనాలను సడెన్‌గా బ్రేక్‌లు వేసి ఆపే క్రమంలో ముప్పుపొంచి ఉంది. ఇదే క్రమంలో వెనకాల వచ్చే వాహనాలు ఢీకొట్టే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటివే గతంలోనే పలు ప్రమాదాలు జరిగినా ఆర్‌అండ్‌బీ అధికారులు మాత్రం వాటిని పట్టించుకున్నట్లు కన్పించడం లేదు.   ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిపై స్పీడు బ్రేకర్లు ఉన్నట్టు సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, స్పీడు బ్రేకర్లకు రంగులు వేయాలని వాహనదారులు కోరుతున్నారు.  
 
మరిన్ని వార్తలు