రోడ్డు స్టాపర్స్‌ అందజేత

9 Aug, 2016 18:37 IST|Sakshi
రోడ్డు స్టాపర్స్‌ అందజేత
మఠంపల్లి : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు స్థానిక మై హోం సిమెంట్స్‌ పరిశ్రమ ఆధ్వర్యంలో రోడ్డు స్టాపర్స్, హై విజబిలిటీ జాకెట్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా పరిశ్రమ జనరల్‌ మేనేజర్‌ జగన్నాథరావు మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టేందుకు గాను పరిశ్రమ ఆధ్వర్యంలో 30 రోడ్డు స్టాపర్స్, మరో 30 హైవిజబులిటీ జాకెట్స్‌ను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ అధికారులు రాజేశ్వరరావు, శ్రీనివాసులు, త్రిలోచనుడు ఉన్నారు.
 
 
>
మరిన్ని వార్తలు