2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి

5 Aug, 2016 20:07 IST|Sakshi
2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి
చింతపల్లి : ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో గ్రామాల్లో పేద ప్రజల, రైతుల కడుపులు కొడితే సహించేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో భూనిర్వాసితుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం 123 జీఓను తెచ్చి ప్రజల కడుపు కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండగా హైకోర్టు ఆ జీఓను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మళ్లీ హైకోర్టులో అప్పీల్‌ చేయడం సమంజసం కాదన్నారు. 2013 చట్టం ప్రకారం భూమికి భూమి, ఇళ్లకు బదులు ఇళ్లు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు సీపీఎం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి. పద్మ, జిల్లా కార్యదర్శి నారి అయిలయ్య, సహాయ కార్యదర్శి శ్రీశైలం, కంబాలపల్లి ఆనంద్, ఉడుగుండ్ల రాములు, నర్సింహ్మ, పోలె యాదయ్య, కృష్ణయ్య, ఆంజనేయులు తదితరులున్నారు.   
మరిన్ని వార్తలు