పులిచింతల ముంపువాసులను ఆదుకోవాలి

30 Sep, 2016 23:33 IST|Sakshi
పులిచింతల ముంపువాసులను ఆదుకోవాలి
హుజూర్‌నగర్‌ : పులిచింతల ముంపు వాసులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి కోరారు. శుక్రవారం పట్టణ ంలోని శ్రీలక్ష్మీగార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదతో పులిచింతల ప్రాజెక్ట్‌లో 30 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం నిల్వ చేసిందన్నారు. ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌తో ముంపుగ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్లినప్పటికీ ఇంకా  కొంత మంది ముంపువాసులకుపరిహారం, పునరావాసం  కల్పించకపోవడం శోచనీయమన్నారు. మట్టపల్లి వద్ద ముంపుకు గురైన మత్స్యకార్మికులకు ఇళ్ల స్థలాలివ్వాలని డిమాండ్‌ చేశారు. వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మిర్చి, వరి పంటల రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు తిరుందాసుగోపి, పారేపల్లి శేఖర్‌రావు, పులిచింతల వెంకటరెడ్డి, వట్టికూటి జంగమయ్య, అనంతప్రకాశ్, యాకూబ్, వట్టెపు సైదులు, పాండునాయక్, ములకలపల్లి సీతయ్య, శీలం శ్రీను, నగేష్, రోషపతి, పల్లె వెంకటరెడ్డి, వెంకటచంద్ర, వినోద పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు