పెద్దవాగు ప్రమాదాన్ని గుర్తు చేసుకున్న జిల్లా వాసులు

22 Aug, 2016 23:44 IST|Sakshi
పెద్దవాగులో పడిన బస్సు
  •  నాటి ప్రమాదంలో 8 మంది చిన్నారులు మృతి

  • కొత్తగూడెం:    డ్రైవర్‌ నిర్లక్ష్యం నిండుప్రాణాలను బలితీస్తోంది. చిన్న చిన్న తప్పులకు విలువైన ప్రాణాలు పోతున్నాయి. నాయకన్‌గూడెం వద్ద జరిగిన ప్రమాదంతో ఇలాంటి సంఘటలను స్థానికులు జ్ఞాపకం చేసుకున్నారు. మార్చి 20, 2012న కొత్తగూడెం మండలం పెద్దవాగు బ్రిడ్జిపై నుంచి బస్సు పడటంతో ఎనిమిది మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఎల్‌వీ రెడ్డి స్కూల్‌ నుంచి చండ్రుగొండ మండలానికి చిన్నారులను తీసుకెళుతున్న బస్సు క్లీనర్‌ అజాగ్రత్త ఫలితంగా బస్సు అదుపుతప్పి పెద్దవాగులో పడిపోయింది. ఈ ఘటనలో చండ్రుగొండ మండలం తుంగారం, వెంగళరావుకాలనీ, టేకులబంజర్, శ్రీరాంపురం, రేపల్లెవాడ, వెంకటాపురం గ్రామాలకు చెందిన ఎనిమిది మంది చిన్నారులు మృతి చెందారు. ప్రస్తుతం నాయకన్‌గూడెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పది మంది మృత్యువాతపడటంతో జిల్లా వాసులు నాటి విషాద జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.


     

మరిన్ని వార్తలు