రైతాంగాన్ని ఆదుకోవాలని ధర్నా

3 Oct, 2016 22:33 IST|Sakshi
రైతాంగాన్ని ఆదుకోవాలని ధర్నా
నకిరేకల్‌ :
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని,  ప్రజలను ఆదుకోవాలని కోరుతూ సీపీఐఎంఎల్‌ నూడెమోక్రసీ, అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో నకిరేకల్‌ సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తహసీల్దార్‌ అంబేద్కర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ డివిజన్‌ కార్యదర్శి రాయి కృష్ణ మాట్లాడుతూ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని, ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. వరుసగా కరువుతో ఇబ్బందులు పడిన రైతాంగం ఈ భారీ వర్షాల వల్ల కోలుకోలేని స్థితిలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంటనష్టాన్ని శాస్త్రీయంగా అంచనావేయాలన్నారు. రెండవ పంటకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం ఉచితంగా అందజేయాలని కోరారు.  కార్యక్రమంలో నాయకులు పల్స యాదగిరి, వేముల కొండ శంకర్, సిలివేరు జానయ్య, జానపాటి దేవయ్య, జుబేదా, అల్లయ్య, రావుల లింగయ్య, వరికుప్పల వెంకన్న, తూర్పాటి వెంకన్న, సైదులు, సురేష్, వెంకన్న, శంభయ్య, లింగారెడ్డి ఉన్నారు.  
 
మరిన్ని వార్తలు