సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి

29 Sep, 2016 22:42 IST|Sakshi
సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి
పెద్దవూర: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతరంపై ఉందని డిప్యూటీ తహసీల్దార్‌ ఇస్లావత్‌ పాండునాయక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని శాంతినికేతన్‌ పాఠశాలలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి«థిగా హాజరై ఆయన మాట్లాడారు. విద్యార్థినులు బతుకమ్మలతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దవూర, తెప్పమడుగు సర్పంచ్‌లు కూతాటి భానుశ్రీదేశ్, చామల సువర్ణభాస్కర్‌రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్‌ నడ్డి ఆంజనేయులు, చామకూరి లింగారెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.
న్యూకిడ్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో.. 
 మండల కేంద్రంలోని న్యూకిడ్స్‌ పబ్లిక్‌ పాఠశాలలోనూ గురువారం విద్యార్థినులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.  మండల కేంద్రంలోని నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో అబ్బాస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ షేక్‌ అబ్బాస్, ఉపాధ్యాయులు రామకృష్ణ, వెంకటయ్య, రషీద్, చిరంజీవి, శ్రీనివాస్‌రెడ్డి, ఖలీల్‌పాషా పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు