నేడు నిజాలంకరణలో భ్రమరాంబాదేవి

11 Oct, 2016 00:18 IST|Sakshi
శ్రీశైలం: శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మంగళవారం విజయదశమిని  పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబాదేవిని నిజాలంకరణలో దర్శనమివ్వనున్నారు. స్వామిఅమ్మవార్లను నందివాహనంపై ఊరేగిస్తూ శమి( జమ్మి) వృక్షం వద్దకు చేరుస్తారు. శమిపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవమూర్తులను తిరిగి యథాస్థానంలో ఆవహింపజేస్తారు.అలాగే దసరా ఉత్సవాలకు  పూర్ణాహుతిని నిర్వహిస్తారు.   
 
మరిన్ని వార్తలు