నేడు విద్యా సంస్థల బంద్‌

1 Aug, 2016 02:22 IST|Sakshi
ఏలూరు సిటీ : రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించే విద్యాసంస్థల బంద్‌కు ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంపన రవికుమార్‌ తెలిపారు. ఆదివారం స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో విద్యాసంస్థల బంద్‌ సన్నాహక సమావేశం సంఘ జిల్లా కార్యదర్శి వి.మహేష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికుమార్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు బంద్‌ నోటీసులు జారీ చేశామన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాస్తారోకోలు, బైక్‌ ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనాలు, మానవహారాలు, ధర్నాలు చేపడతామని తెలిపారు. ఈ రాష్ట్ర వ్యాప్త బంద్‌లో బాగంగా జిల్లాలో బంద్‌ను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఈ బంద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాలు సంయుక్తంగా నిర్వహించే విద్యాసంస్థల బంద్‌కు పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి కె.క్రాంతిబాబు, నగర ఉపాధ్యక్షుడు సీహెచ్‌ భరత్‌సాయి, పి.శివ, నాయకులు ప్రవీణ్, హేమంత్, శేఖర్, అరుణ్, ఇబ్రహీం పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు