నేడు మంచిర్యాలలో ముగ్గుల పోటీలు

10 Jan, 2017 22:45 IST|Sakshi

వేదిక : సెవెన్‌హిల్స్‌   హైస్కూల్, ఫైర్‌స్టేషన్‌     దగ్గర, మంచిర్యాల
తేదీ : 10వ తేదీ         మంగళవారం
సమయం : ఉదయం     10 గంటల నుంచి....
నిర్వహణ : ‘సాక్షి’         మీడియా గ్రూప్‌


మంచిర్యాల టౌన్‌ : తెలుగు మహిళల సృజనాత్మకతను ప్రపంచానికి చాటి చెప్పిన అద్భుతమైన సంప్రదాయ కళారూపం రంగవల్లి. ‘సాక్షి’ మీడియా గ్రూప్, ధర్మరాజు మెటర్నటీ అండ్‌ సర్జికల్, నర్సింగ్‌హోం మంచిర్యాల, మహాలక్ష్మి స్వీట్‌ హౌజ్‌ మంచిర్యాల, శ్రీ వాసవి మెడికల్, జనరల్‌ స్టోర్స్‌ మంచిర్యాల, శ్రీ కళానికేతన్‌ షాపింగ్‌ మాల్‌ మంచిర్యాల సంయుక్త నిర్వహణలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సెవెన్‌హిల్స్‌ హైస్కూల్, ఫైర్‌స్టేషన్‌ దగ్గర ముగ్గుల పోటీలు నిర్వహిస్తోంది.

ఆసక్తి ఉన్న మహిళలను ‘సాక్షి’ ఆహ్వానిస్తోంది. విజేతలకు అదేరోజు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. ముగ్గు వేసేందుకు అవసరమైన రంగులు ఎవరికి వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది. పోటీల్లో పాల్గొనే ఆసక్తి గల వారు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవచ్చు. సంప్రదించాల్సిన సెల్‌ నంబర్లు 90102 99065, 99516 02823లో గానీ.. లేదా మంగళవారం ఉదయం 9 నుంచి సెవెన్‌హిల్స్‌ పాఠశాల  వద్ద పేర్లను నమోదు చేసుకోవచ్చు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా