నేడు మెగా జాబ్‌ మేళా

16 Dec, 2016 00:29 IST|Sakshi
రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : 
ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో శుక్ర, శనివారాల్లో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. వికాస్, ఎన్టీఆర్‌ ట్రస్టుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ జాబ్‌ మేళాకు రాష్ట్రంలో నలుమూల నుంచి సుమారు 27 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ¯ŒSలై¯ŒSలో 13 వేల మంది రిజిస్టర్‌ చేసుకున్నారని నన్నయ వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలనాయుడు గురువారం తెలిపారు. జాబ్‌ మేళా నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విప్రో, ఇన్ఫోసిస్, గూగుల్, జెస్‌ ఫ్యాక్ట్, టెక్‌ మహేంద్ర, జీఎంఆర్, హెచ్‌సీఎల్‌. ఐసీఐసీఐ, రిలయ¯Œ్స, ఎయిర్‌టెల్, ఏటీఎం, క్వారీ వంటి ప్రముఖ వంద కంపెనీలు పాల్గొంటాయన్నారు. అలాగే ఫార్మా రంగానికి చె ందిన కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా ఆయా కంపెనీల ప్రతినిధులు రానున్నారన్నారు. 
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్, ఫార్మసీ తదితర అర్హతలున్న వారంతా ఈ జాబ్‌ మేళాకు హజరుకావొచ్చన్నారు. ఇప్పటికే రిజిస్టర్‌ చేసుకున్న వారితోపాటు స్పాట్‌లో రిజిస్ట్రేష¯ŒS చేసుకునే వారికి అవకాశం ఉంటుందన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌కేవీటీ కళాశాల ప్రాంగణాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు జాబ్‌ మేళా జరుగుతుందన్నారు. అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలతో అభ్యర్థులు హాజరుకావాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సాయంత్రమే నియామక పత్రాలు అందజేస్తారన్నారు. 
 
మరిన్ని వార్తలు