నేడు కదిరిదేవరపల్లికి ట్రయల్‌ రైలు రన్‌

20 Mar, 2017 22:23 IST|Sakshi

కళ్యాణదుర్గం :

కళ్యాణదుర్గం నుంచి కదిరిదేవరపల్లి వరకు మంగళవారం రైలు ట్రయల్‌ రన్‌ చేపట్టనున్నట్లు చీఫ్‌ ఇంజినీర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్‌ నెలలో కళ్యాణదుర్గం వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించి, ఇక్కడి నుంచి రాయదుర్గం, బళ్లారి మీదుగా తిరుపతికి రైలు రాకపోకలు సాగిస్తోందన్నారు.   ప్రస్తుతం కళ్యాణదుర్గం నుంచి కదిరిదేవరపల్లి వరకు 23 కిలో మీటర్ల మేర రైల్వే లైన్‌ ఏర్పాటు పనులు పూర్తయ్యాయన్నారు. దీంతో ఇక్కడ రైలు ట్రయల్‌ రన్‌ చేపడుతున్నామని కార్యక్రమానికి కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేప్టీ(సీఆర్‌ఎస్‌) ఉన్నతాధికారి కేఏ మనోహరన్‌ రానున్నట్లు సీఈ తెలిపారు. సంబంధిత అధికారి పనులను పరిశీలిస్తారన్నారు. ట్రయల్‌ రన్‌ అనంతరం వారం రోజుల తర్వాత రైలు రాకపోకలను కదిరిదేవరపల్లి వరకు పొడిగిస్తామన్నారు. 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు