ఒగ్గు కథకు వన్నె తెచ్చిన మిద్దె

9 Aug, 2016 20:11 IST|Sakshi
ఒగ్గు కథకు వన్నె తెచ్చిన మిద్దె
  •  మిద్దె రాములు జయంతికి ఏర్పాట్లు
  • వేములవాడలో  సమావేశం 
  • అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు హాజరు
  • వేములవాడ రూరల్‌: తెలంగాణ ఒగ్గుకళారూపానికి వన్నె తెచ్చిన ప్రముఖ ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు 76వ జయంతి బుధవారం జరగనుంది.  జయంతికి రాష్ట్ర నలుమూలల నుంచి ఆయన అభిమానులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు హాజరవుతున్నట్లు మిద్దె రాములు కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు మిద్దె పర్శరాములు తెలిపారు. మి§ð ్దరామలు 50 సంవత్సరాలకుపైగా ఒగ్గు కళాప్రదర్శనను ఇచ్చి గుర్తింపు తెచ్చారని, ఎన్నో అవార్డులు అందుకున్నారని వివరించారు. బుధవారం జరిగే జయంతి ఉత్సవాల్లో భాగంగా  తిప్పాపురం తెలంగాణ విగ్రహం నుంచి కళాకారులతో ర్యాలీగా బయలుదేరి వేములవాడ గాంధీనగర్‌లోగల రవీంద్ర ఫంక్షన్‌హాల్‌ వరకు చేరుకుంటుందని తెలిపారు. అనంతరం ఫంక్షన్‌హాల్‌లో  కళాకారులతో కళాప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కళాప్రదర్శనలో పాల్గొన్న కళాకారులకు బహుమతులను అందించనున్నట్లు తెలిపారు. డీపీఆర్వో ప్రసాద్, ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, పత్తిపాక మోహన్, వేములవాడ ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ఎంపీపీ రంగు వెంకటేశంగౌడ్, నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ నామాల ఉమ, జెడ్పీటీసీ గుడిసె శ్రీకాంత్, తదితరులు హాజరవుతున్నట్లు చెప్పారు.
     
     
మరిన్ని వార్తలు