నేడు ఎస్‌ఐ ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష

26 Nov, 2016 23:36 IST|Sakshi
నేడు ఎస్‌ఐ ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష
 – ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ 
– పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు 
– నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ 
 
కర్నూలు : పోలీసు శాఖలో ఎస్‌ఐ ఎంపికకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఎస్‌ఐ పోస్టులకు మొత్తం 15,622 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి పరీక్ష నిర్వహణకు కర్నూలు నగరంలో  మొత్తం 26 సెంటర్లలో ఏర్పాట్లను పూర్తి చేశారు.  బయోమెట్రిక్‌ హాజరుతో పరీక్షకు అనుమతించనున్నారు.అభ్యర్థులు ఉదయం 9 గంటలకల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఏడుగురు సీఐలు, 21 మంది ఎస్‌ఐలు, 150 మంది కానిస్టేబుళ్లను ఆయా కేంద్రాల వద్ద బందోబస్తు విధులకు నియమించారు. డీఐజీ రమణకుమార్‌ ఆదేశాల మేరకు ఎస్పీ ఆకే రవికృష్ణ శనివారం నగరంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీని తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ కోసం కళాశాల యాజమాన్యం చేసిన ఏర్పాట్లను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతా చర్యలను చేపట్టాలని సూచించారు. డీఎస్పీ రమణమూర్తి, సీఐలు డేగల ప్రభాకర్, కళాశాలల సిబ్బంది ఎస్పీ వెంట ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు