నేడు అంధుల టీ-20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌

6 Feb, 2017 23:58 IST|Sakshi
నేడు అంధుల టీ-20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌
  •  తలపడనున్న దక్షిణాఫిక్రా - వెస్టిండీస్‌
  • ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
  • వేదిక : ఆర్డీటీ ప్రధాన మైదానం
    సమయం : ఉదయం 10 గంటలకు
    ప్రవేశం : ఉచితం
     
     
    అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : నేడు అంధుల టీ-20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌  జరుగనుంది. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఆర్డీటీ క్రీడా మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. కలెక్టర్‌ కోన శశిధర్‌ మ్యాచ్‌ను ప్రారంభించనున్నారు.  క్రికెట్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ ఇన్‌ ఇండియా(క్యాబి), సమర్థనం ట్రస్ట్‌లు సంయుక్తంగా ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న పోటీల్లో భాగంగా అనంతపురంలోనూ మ్యాచ్‌ జరుగుతోంది.
     
     
     
    పిచ్‌ సిద్ధం
    వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో భాగంగా ఽఆర్డీటీ సిబ్బంది ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మ్యాచ్‌ జరిగే పిచ్‌తో పాటు అవుట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేశారు. క్రీడాకారులకు ఏమాత్రం ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకున్నారు.
     
    ప్రవేశం ఉచితం
    జిల్లాలో మొదటిసారిగా జరుగుతున్న అంధుల టీ-20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ను ప్రతి ఒక్కరూ ఉచితంగానే చూడొచ్చని సమర్థనం ట్రస్ట్‌ ఆంధ్ర, తెలంగాణ హెడ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మ్యాచ్‌ను దాదాపు 8 వేల మంది వీక్షించే అవకాశం ఉందని చెప్పారు. వివిధ పాఠశాలలకు చెందిన 3 వేల మంది విద్యార్థులు మ్యాచ్‌ను వీక్షిస్తారన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఈఓ, ఎంఈఓలకు ఇన్విటేషన్‌లను అందించామని తెలిపారు. మ్యాచ్‌ విజయవంతానికి అందరూ సహకరించాలన్నారు.
     
    100 మంది వలంటీర్లు
    వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేకమైన గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వారి కోసం ప్రత్యేకంగా సీట్లను కేటాయించారు. ఇక.. మైదానంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లను చేపట్టారు. అలాగే 100 మంది వలంటీర్లను ఈ మ్యాచ్‌ సజావుగా జరిగేందుకు నియమించారు.
     
    జిల్లా క్రీడాకారులే అంపైర్లు
    అంధుల ప్రపంచకప్‌ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు అన్సర్‌ఖాన్, బాలసుబ్రహ్మణ్యం, అక్కులన్నలు అంపైర్లుగా ఎంపికయ్యారు. వీరిలో బీసీసీఐ లెవల్‌1 క్వాలిఫైయింగ్‌ అంపైర్లుగా అన్సర్‌ఖాన్, బాలసుబ్రహ్మణ్యం , స్కోరర్‌గా అక్కులన్న వ్యవహరిస్తారు. వీరితో పాటు ఆన్‌లైన్‌ స్కోరర్‌గా  రాష్ట్ర క్రీడాకారుడు వినీల్‌కుమార్‌ను నియమించారు. 
మరిన్ని వార్తలు