నేడు, రేపు జనగామ బంద్‌

13 Aug, 2016 00:16 IST|Sakshi
స్పీకర్‌ కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు జేఏసీ నేతల యత్నం
అడ్డుకుని, అదుపులోకి తీసుకున్న పోలీసులు
 
జనగామ :  జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జనగామలో శనివారం నుంచి 48 గంటల బం ద్‌కు  పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసు లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్‌కు అన్ని వర్గాల వారు మద్దతు ప్రకటించాలని జేఏ సీ చైర్మెన్‌ ఆరుట్ల దశమంతరెడ్డి పిలుపునిచ్చా రు. జిల్లా సాధన పోరు తుదిదశకు చేరుకోవడంతో జేఏసీ నాయకులు ఉద్యమాన్ని ఉ«దృతం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న శాసన సభ స్పీకర్‌ సిరికొండ మధుసూధనాచారి వాహనాని కి అడ్డుపడి ప్లకార్డులతో నిరసన తెలిపారు. 
జేఏసీ నాయకులు గండి నాగరాజు, ఇరుగు రమేష్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌ కళ్లకు నల్లరిబ్బన్‌ కట్టి నిరసన  తెలిపారు. జిల్లా సాధన సమితి కన్వీనర్‌ మంగళ్లపల్లి రాజు విద్యార్థులతో కలిసి రాస్తారోకో చేసే ప్రయత్నంలో ఉండగా పోలీసులు అడ్డుకుని రాజుతో పాటు నాగరాజు, రమేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.  
మరిన్ని వార్తలు