రేపటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత సిమ్‌ మేళా

20 Jun, 2017 00:00 IST|Sakshi
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) :
జిల్లా వ్యాప్తంగా సబ్‌డివిజనల్‌ ఇంజనీర్‌ పరిధిలోని అన్ని ముఖ్య ప్రదేశాల్లో ఈ నెల 21వ తేదీ బుధవారం నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత సిమ్‌ రోడ్‌షో మేళా నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ చల్లా శివభాస్కర్‌ సోమవారం తెలిపారు. ఈ మేళా 24వ తేదీవరకు నిర్వహిస్తామన్నారు. ఈ మేళాలో బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్‌ కనెక‌్షన్లు కూడా ఇస్తామన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మరిన్ని వార్తలు