రేపు 20 సెంటర్లలో ప్రిలిమినరీ పరీక్ష

6 May, 2017 00:27 IST|Sakshi
పకడ్బందీ నిర్వహణకు ఏర్పాట్లు
నిమిషం ఆలస్యమైన అనుమతించం 
డీఆర్‌ఓ గంగాధర్‌ గౌడ్‌
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూపు–1 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 7వ తేదీ (ఆదివారం) జరుగనుంది. ఈ పరీక్షకు 9258 మంది హాజరు కానున్నారు. పరీక్ష కోసం కర్నూలు నగరంలో 20 సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుంది.. ఈ సందర్బంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, లైజన్‌ ఆఫీసర్లు, అసిస్టెంటు లైజన్‌ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు  మాట్లాడుతూ... పరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. పరీక్ష ఉదయం 10.30 గంటలకు మొదలవుతుందని, అభ్యర్ధులను 10.15 గంటలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించమన్నారు. కర్నూలు, కల్లూరు, నందికోట్కూరు, డోన్, పగిడ్యాల తహశీల్దార్లను లైజన్‌ అధికారులుగా నియమించామని తెలిపారు. ప్రతి సెంటరుకు ఓ డిప్యూటీ తహసీల్దారును సిట్టింగ్‌ స్క్వాడ్‌గా నియమించినట్లు పేర్కొన్నారు. ఏపీపీఎస్‌సీ స
సెక‌్షన్‌ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు విధిగా హాల్‌ టికెట్‌తో పాటు ఏదో ఒక ఒరిజినల్‌ గుర్తింపు కార్డును తీసుకరావాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, పరీక్షల సూపరింటెండెంటు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు