‘టాప్‌’ లెవెల్లో డేం‘జర్నీ’

2 Jan, 2017 22:21 IST|Sakshi
‘సురక్షితం, సుఖవంతం’.. ఇది ఆర్టీసీ నినాదం. అయితే ఈ చిత్రం చూస్తుంటే ఆ సంస్థ తన నినాదాన్ని తానే గౌరవించడం లేదనిపించక మానదు. ఆటోలు, జీపుల వంటి ప్రైవేట్‌ వాహనాల వారికి ప్రయాణికుల భద్రతకు సంబంధించి అణుమాత్రం స్పృహ కనిపించదు. వాహనాల సామరŠాథ్యనికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. లోపల ఖాళీ లేకపోతే.. కొందరు కమ్మీలను పట్టుకుని వేలాడుతుండగానో, టాపులపై కూర్చుండగానో వాహనాలను నడిపేస్తుంటారు. సోమవారం భద్రాచలం నుంచి రావులపాలెం వెళుతున్న రావులపాలెం డిపోకు చెందిన ఏపీ29జెడ్‌ 3387 నంబర్‌ బస్సు లోపల మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. మారేడుమిల్లిలో ఓ యువకుడు బస్సుటాపుపైకి ఎక్కాడు. పలుచోట్ల విద్యుత్‌వైర్లు అతడు నిలబడితే తగిలేంత ఎత్తులోనే ఉన్నాయి. ‘ఆ యువకుడు టాపుపైకి మీకు తెలిసే ఎక్కాడా? తెలియకుండానా?’ అని డ్రైవర్, కండక్టర్లను అడిగితే పట్టించుకోకుండానే బస్సును లాగించేశారు. బస్సు పరుగందుకుంటుండగా ఆ యువకుడు సెల్ఫీ తీసుకోవడం కొసమెరుపు. 
– మారేడుమిల్లి 
 
>
మరిన్ని వార్తలు