గొర్రెల పెంపకానికి సంపూర్ణ సహకారం

14 Sep, 2016 00:50 IST|Sakshi
గొర్రెల పెంపకానికి సంపూర్ణ సహకారం

– ఎన్‌సీడీసీ చీఫ్‌ ముఖేశ్‌ కుమార్‌
– రాష్ట్ర పర్యటన అనంతరం జిల్లాకు నిధులు

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో గొర్రెల పెంపకాన్ని మరింత అభివద్ధి చేసేందుకు అన్నివిధాల సహకరిస్తామని జాతీయ సహకార అభివద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ) చీఫ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని రీజినల్‌ కార్యాలయం అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో కలసి మంగళవారం కర్నూలు వచ్చిన ఆయన పంచలింగాల, గొందిపర్ల, ఈ. తాండ్రపాడులోని గొర్రెల పెంపకందారులతో చర్చించారు. ఇప్పటి వరకు గొర్రెల పెంపకంలో ఎలా రాణిస్తున్నారు.. ఎన్‌సీడీసీ ద్వారా రుణాలు ఇస్తే ఏ విధంగా వినియోగించుకుంటారనే విషయాపై ఆరా తీశారు. రుణాలు తీసుకోవాలంటే ఆస్తులు తనఖా పెట్టాల్సింటుందని తెలిపారు. అనంతరం అమరావతి హోటల్‌లో జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్‌ వై. నాగేశ్వరరావు యాదవ్, డైరెక్టర్లతో సమావేశమయ్యారు. కురువ, గొల్ల సామాజిక వర్గాల ప్రధాన వత్తి గొర్రెల పెంపకమేనని, తగిన చేయూతనిస్తే రాణిస్తారని ఈ సందర్భంగా చైర్మన్‌ వారికి వివరించారు. ఎన్‌సీడీసీ నిధులతో గొర్రెల పెంపకందారులను ఆదుకోవడానికి  రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వివరించారు. దీనిపై ముఖేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ జాతీయ సహకార అభివద్ధి సంస్థ గొర్రెల పెంపకంలాంటి వత్తులను ప్రోత్సహిస్తుందని, తగిన కార్యాచరణ ప్రణాళికలు సమర్పిస్తే జిల్లాకు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటన ముగించిన తర్వాత ప్రతిపాధించిన మేరకు నిధులు విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గొర్రెల అభివద్ధి విభాగం సహాయ సంచాలకులు డాక్టర్‌ చంద్రశేఖర్, అసిస్టెంట్‌ వెటర్నరీ సర్జన్‌ డాక్టర్‌ సుంకన్న, జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు