కేరళ హంగులతో కోన సీమ అభివృద్ధి

8 Oct, 2016 23:24 IST|Sakshi
ఏపీ టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీకాంత్‌
దిండి(మలికిపురం) : 
కోనసీమ పర్యాటకాన్ని కేరళ  హంగులతో అభివృద్ధి చేయనున్నట్టు ఏపీ టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌.శ్రీకాంత్‌ పేర్కొన్నారు. శనివారం దిండి టూరిజం కేంద్రంలో కేరళ కన్సల్టెన్సీలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కన్సల్టెన్సీ ప్రతినిధులు ఇచ్చిన ప్రదర్శనను ఆయన తిలకించారు. ఆయన మాట్లాడుతూ కోనసీమ సంప్రదాయాలకు అనుగుణంగా కేరళ నమూనాలతో టూరిజం అభివృద్ధి చేసేందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌కు సూచించారు. కోనసీమ పర్యాటక ప్రదేశాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పారు. కేరళకు దీటుగా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆర్డీఓ గణేష్‌కుమార్, అఖండ గోదావరి ప్రత్యేకాధికారి భీమశంకరం తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు